- అమెరికా, చైనా కొనకపోవడమే కారణం
- రఫ్ డైమండ్స్ ఆక్షన్స్ వాయిదా
- కొత్త మార్కెట్ల కోసం వేట
వెలుగు బిజినెస్ డెస్క్: మన డైమండ్ కంపెనీలు భాగం పంచుకోలేమనడంతో రఫ్ డైమండ్ ఆక్షన్స్‌ను అక్కడి ఆక్షన్ హౌస్‌లు కాన్సిల్చేశాయి. అంతేకాదు, గ్లోబల్‌గా పేరొందిన డైమండ్ మైనింగ్ కంపెనీ డి బీర్స్ కూడా తన ఆక్షన్స్‌ను వాయిదా వేసింది. అమెరికా, చైనా దేశాలలో పాలిష్డ్ డైమండ్స్‌కు డిమాండ్ పడిపోవడం వల్లే మన డైమండ్ కంపెనీలు ఆక్షన్లలో పాల్గొనడానికి ఇష్టపడటం లేదు. మన దేశపు కంపెనీలు పాల్గొనలేమని చెప్పడంతో బెల్జియం, దుబాయ్ దేశాలలో ఆక్షన్ హౌస్‌లు ఆక్షన్స్‌ను ఆపేశాయని జెమ్ అండ్ జ్యుయెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (జీజేఈపీసీ) చైర్మన్ విపుల్ షా చెప్పారు. గిరాకీ పెరిగితే తప్ప తాము పాల్గొనలేమని మన కంపెనీలు స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు.
పదింటిలో తొమ్మిది మనమే పాలిష్ చేస్తున్నం...
గ్లోబల్ మార్కెట్లలో అమ్మే పాలిష్డ్ డైమండ్స్ ప్రతి పదింటిలో తొమ్మిదింటినీ మన దేశంలోని కంపెనీలే కట్ చేసి పాలిష్ చేస్తాయి. మార్కెట్లోని పరిస్థితులను విశ్లేషించిన తర్వాత ఆక్షన్స్‌ను వాయిదా వేయడమే మేలని నిర్ణయించుకున్నట్లు డి బీర్స్ గ్రూప్ డైమండ్ ట్రేడ్ కంపెనీలకు సమాచారం పంపించింది. తన ఇంటరిమ్, మెయిన్ ఆక్షన్స్‌ను ఇప్పుడు కలిపే నిర్వహించాలనే ఆలోచనకు వచ్చినట్లు పేర్కొంది. బల్క్ బయ్యర్ల కోసం రఫ్ డైమండ్స్ చూపించే కార్యక్రమాన్ని కూడా పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని మళ్లీ ఎప్పుడు నిర్వహించేదీ తర్వాత తెలియచేస్తామని తెలిపింది. గ్లోబల్ మార్కెట్లలో డైమండ్స్‌కు గిరాకీ లేకపోవడంతో రఫ్ డైమండ్స్ రేట్లు 10 శాతం తగ్గిపోయాయి. మార్కెట్లో ప్రస్తుతం అనిశ్చితి నెలకొందని, గిరాకీ తగ్గిపోయిందని, ఈ గిరాకీ ఎప్పుడు పెరుగుతుందో తెలియడం లేదని విపుల్ షా అన్నారు. అమెరికా, చైనా దేశాల మార్కెట్లే ప్రధానంగా ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. బాగా ఖరీదైన డైమండ్స్ అమెరికాలో ఇప్పుడు కూడా అమ్ముడవుతున్నాయని, కానీ మిడ్–సెగ్మెంట్ డైమండ్స్ మాత్రం అమ్ముడుపోవడం లేదని వివరించారు. ఇదే డిమాండ్‌ను దెబ్బ తీస్తోందని పేర్కొన్నారు.
పాలిష్డ్ డైమండ్స్‌కు గిరాకీ తగ్గిన ప్రభావం ఈ క్వార్టర్లో మన ఎగుమతులపై పడుతుందని జీజేఈపీసీ చైర్మన్ చెప్పారు. రెండో పెద్ద మార్కెట్టయిన చైనాలోనూ పరిస్థితులు ఆశావహంగా కనబడటం లేదన్నారు. రెండో క్వార్టర్ దాకా వేచి చూడాల్సిందేనని పేర్కొన్నారు. అమెరికాలో డైమండ్స్‌కు గిరాకీ పడిపోవడంతో ఇప్పుడు డైమండ్ కంపెనీలు కెనడా మార్కెట్ వైపు చూస్తున్నాయి. కెనడాలోని గవర్నమెంట్‌తో చర్చలు జరిపేందుకు మన దేశం నుంచి ఒక టీమ్ బయలుదేరి వెళ్తోంది. కాంప్రహెన్సివ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్ ఎగ్రిమెంట్ (సీఈపీఏ) కుదుర్చుకునే దిశలో ఈ టీమ్ ప్రయత్నాలు చేస్తోంది. కెనడా మార్కెట్లోకి అడుగు పెట్టడానికి ఇంకా కొంత టైము పడుతుందని, ప్రయత్నాలు మాత్రం కొనసాగిస్తున్నామని షా వెల్లడించారు. మార్చి 2023తో ముగిసిన ఫైనాన్షియల్ ఇయర్లో మన దేశపు గ్రాస్ ఎక్స్‌పోర్ట్స్ (కట్, పాలిష్డ్ డైమండ్స్) 22,044 మిలియన్ డాలర్లకు చేరాయి. అంతకు ముందు ఫైనాన్షియల్ ఇయర్‌లోని 24,433 మిలియన్ డాలర్ల నుంచి ఈ ఎగుమతులు 9.78 శాతం తగ్గిపోయినట్లు.
