ఉద్యోగాల గురించి ప్రధాని మోడీ మాట్లాడరేం?

ఉద్యోగాల గురించి ప్రధాని మోడీ మాట్లాడరేం?

 చంపారన్: బిహార్‌‌ను నాశనం చేశారంటూ బీజేపీ, జేడీ (యూ)పై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. బిహార్ ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న రాహుల్.. ప్రధాని మోడీని టార్గెట్ చేసుకుంటూ పలు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని ఉద్యోగాల ఊసెత్తడం లేదంటూ రాహుల్ ఫైర్ అయ్యారు. మోడీ అబద్ధాలను నమ్మకడానికి ప్రజలు సిద్ధంగా లేరని విమర్శించారు.

‘బిహార్‌‌లో గత అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ నెలకొల్పుతామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలతో కలసి టీ తాగుతానని ఆయన మాటిచ్చారు. ఇది మీకు గుర్తుందా? ఆయన మీతో చాయ్ తాగారా? ఈ రోజుల్లో మోడీజీ ఉద్యోగాల గురించి అస్సలు మాట్లాడటం లేదు. జాబ్స్ కోసం బిహారీలు ఇతర రాష్ట్రాలకు ఎందుకు వలస వెళ్తున్నారు? మన బిహార్ సోదరులు, సోదరీమణుల్లో ఏమైనా లోపం ఉందా? కాదు. మన సీఎం, ప్రధానిలోనే లోపాలు ఉన్నాయి. మోడీ అబద్ధాలను నమ్మడానికి బిహార్‌‌లో ఎవరూ సిద్ధంగా లేరు. దశాబ్దాలుగా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఎలా పాలించాలో మాకు బాగా తెలుసు. మేమెప్పుడూ అబద్ధాలు చెప్పలేదు’ అని రాహుల్ పేర్కొన్నారు.