ఐస్ క్రీమ్ లో బల్లి : యువకుడికి వాంతులు

ఐస్ క్రీమ్ లో బల్లి : యువకుడికి వాంతులు

హుజూరాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని రాంపూర్ గ్రామంలో ఓ యువకుడు కొనుగోలు చేసిన ఐస్‌ క్రీమ్‌ లో బల్లి వచ్చింది. ఈ ఘటన స్థానికుల్లో ఆందోళన సృష్టించింది. రాంపూర్‌ కు చెందిన వనం శ్రీకాంత్ అనే యువకుడు రంగాపూర్ శివారులో తోపుడు బండి వద్ద ఐస్‌ క్రీం కొనుగోలు చేశాడు. అది తింటుండగా బల్లి కనబడడడంతో ఒక్కసారిగా వాంతులు చేసుకున్నాడు. ఐస్‌ క్రీమ్ తయారీదారులపై చర్యలు తీసుకోవాలని శ్రీకాంత్ కోరాడు.