ఆర్టీసీ బస్సులకు కర్నాటక నుంచి డీజిల్

ఆర్టీసీ బస్సులకు కర్నాటక నుంచి డీజిల్

ఆర్టీసీ బస్సులకు కర్నాటక డీజిల్ తెప్సిస్తున్నారు అధికారులు. కర్నాటక బోర్డర్ లోని డీపోలకు..ట్యాంకర్ల ద్వారా డీజిల్ తెప్పిస్తున్నారు. కర్నాటక, మన రాష్ట్రంలో లీటర్ డీజిల్ 11 రూపాయల వ్యాత్యాసం ఉంది. రాష్ట్రంలో లీటర్ డీజిల్ 106 రూపాయల 76 పైసలు. కర్నాటకలో లీటర్ డీజిల్ 95 రూపాయల 57 పైసలు మాత్రమే. దాదాపు 11 రూపాయలు తగ్గుతుంది. అంతేకాదు..అక్కడికి వెళ్లి రావడానికి అయ్యే ఖర్చు కూడా మిగులుతుంది. దీంతో సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ , జహీరాబాద్  డిపో మేనేజర్లు కర్ణాటక నుంచి డీజిల్  కొనుగోలు చేస్తున్నారు. 

ఆర్టీసీ డీజిల్  భారం మోయలేకపోతోంది. ఖర్చు తగ్గించుకోవడానికి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బంకులను ఆశ్రయిస్తోంది. కర్ణాటకలోని బీజేపీ సర్కారు పెట్రోల్, డీజిల్ పై పన్నులు తగ్గించడంతో..  అక్కడ లీటరు 95 రూపాయల 57 పైసలుకే దొరుకుతోంది. దీంతో సరిహద్దు ప్రాంతాల్లోని ఆర్టీసీ డిపోలు కర్ణాటకపై ఫోకస్ పెట్టాయి. ఆర్టీసీ ఉన్నతాధికారుల ఆదేశాలతోనే కర్నాటక నుంచి డీజిల్ తెప్పిస్తున్నామన డీపో మేనేజర్లు చెప్తున్నారు. ఎక్కడ రేటు తక్కువగా ఉంటే..అక్కడి నుంచే డీజిల్ తెప్పించుకోవాలని సూచించినట్టు చెప్తున్నారు.  

నారాయణఖేడ్ , జహీరాబాద్  డిపోల బస్సులకు 30 కిలోమీటర్ల దూరంలోని బీదర్ నుంచి డీజిల్ కొంటున్నారు. నారాయణఖేడ్ , జహీరాబాద్  డిపోల్లోని బస్సుల కోసం రెండు రోజులకు దాదాపు 12 వేల లీటర్ల డీజిల్ కొంటున్నారు. కర్నాటక నుంచి డీజిల్ తెప్పించడంతో లక్షా 30 వేల రూపాయలకు పైగామిగులుతున్నాయని చెప్తున్నారు. రెండు, మూడు నెలలుగా  కర్నాటక నుంచే అవసరమైన డీజిల్ కొనుగోలు చేస్తున్నారు. రెండు డిపోలకు వినియోగించే డీజిల్ ఖర్చులో నెలకు దాదాపు 20 లక్షల వరకు ఆదా చేస్తున్నామని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. సంగారెడ్డి జిల్లా నాగిలిగిద్ద చెక్ పోస్ట్ దగ్గర.. డీజిల్ ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు డీజిల్ ట్యాంకర్ ను పట్టుకున్నారు. ఐతే ఆర్టీసీ అధికారులు వచ్చి తామే బస్సుల కోసం తెప్పిస్తున్నామని పోలీసులకు చెప్పారు. రవాణాకు సంబంధించి డాక్యుమెంట్స్ చూపించడంతో ట్యాంకర్ ను వదిలిపెట్టారు పోలీసులు.