తగ్గిన డీజిల్‌‌‌‌ సేల్స్‌‌‌‌..పెరిగిన పెట్రోల్ వాడకం

తగ్గిన డీజిల్‌‌‌‌ సేల్స్‌‌‌‌..పెరిగిన పెట్రోల్ వాడకం

న్యూఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో డీజిల్ అమ్మకాలు 3 శాతం (ఇయర్ ఆన్ ఇయర్) పడిపోయాయి. వర్షాకాలం ప్రారంభమవ్వడంతో డిమాండ్‌‌‌‌ తగ్గిందని, మరోవైపు ఇండస్ట్రీ యాక్టివిటీ కూడా స్లో అయ్యిందని  అందుకే సేల్స్ పడిపోయాయని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చెబుతున్నాయి. 

మరోవైపు పెట్రోల్ సేల్స్ పెరగడం విశేషం. కిందటేడాది  సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో 59.9 లక్షల టన్నుల డీజిల్ వినియోగం జరగగా, ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో ఈ నెంబర్  58.1 లక్షల టన్నులకు తగ్గింది. కిందటి నెల మొదటి 15 రోజుల్లో డీజిల్ డిమాండ్ 5 శాతం తగ్గిందని, వర్షాలు తగ్గడంతో చివరి 15 రోజుల్లో స్వల్పంగా పుంజుకుందని ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి.