DigiLocker:ఫ్రీ క్లౌడ్ స్టోరేజీతో డిజీ లాకర్

DigiLocker:ఫ్రీ క్లౌడ్ స్టోరేజీతో డిజీ లాకర్
  • డిజీ లాకర్​ ఫ్రీ క్లౌడ్ సర్వీస్​ 

డిజీలాకర్​లో అఫీషియల్ డాక్యుమెంట్లను ఆన్​లైన్​లో సేఫ్​గా స్టోర్​ చేసుకోవచ్చు. అంతే ఈజీగా యాక్సెస్ చేసి షేర్ చేయొచ్చు. ఫిజికల్ కాపీలలానే డిజీలాకర్ డాక్యుమెంట్లు వ్యాలిడ్ అవుతాయి. అయితే ఇప్పుడు ఈ సర్వీస్​ ఫ్రీ క్లౌడ్ స్టోరేజీ​తో వస్తుంది. యూజర్లు తమ ఫోన్​లేదా ల్యాప్​టాప్​ నుంచి ఫైల్స్, ఫొటోలు, వీడియోలు వంటి వాటిని అప్​లోడ్​ చేసుకోవచ్చు. దీంతో క్లౌడ్​లో సేఫ్​గా స్టోర్​ చేయొచ్చు. 

అవసరమైన చోట యాక్సెస్ చేయొచ్చు. ఫోన్​ లేదా  పీసీ నుంచి డేటా అప్​లోడ్ చేశాక, కొత్త ఫోల్డర్​లను కూడా క్రియేట్​ చేయొచ్చు. డిజీలాకర్ డ్రైవ్ క్లౌడ్​ స్టోరేజీ క్లెయిమ్​ చేసుకోవాలంటే.. ముందుగా డిజిలాకర్ వెబ్​సైట్ లేదా మొబైల్​ యాప్​లో లాగిన్​ అవ్వాలి. కొత్తవాళ్లైతే అకౌంట్ క్రియేట్​ చేసుకోవాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత డ్రైవ్ ఆప్షన్​ సెలక్ట్ చేయగానే యాక్టివేట్ అవుతుంది. 

దాంతో1జీబీ ఫ్రీ క్లౌడ్ స్టోరేజీ పొందొచ్చు. ఫైల్స్ స్టోర్ చేసేందుకు కుడివైపు పైన ఉన్న ప్లస్​ ఐకాన్​ మీద ట్యాప్ చేయాలి. కొత్త ఫోల్డర్​ కోసం అయితే అప్​లోడ్ ఫైల్స్ లేదా న్యూ క్రియేట్​ ఫోల్డర్​ సెలక్ట్ చేయాలి. అప్​లోడ్ చేసిన డాక్యుమెంట్లు లేదా ఫైల్స్​పై ఈ–సైన్​ చేయొచ్చు. ఎప్పుడైనా డౌన్​లోడ్ చేసి షేర్​ చేసుకోవచ్చు. 

ఆటో అప్​డేట్ ఆఫ్​ చేస్తే..

మొబైల్​ డేటా త్వరగా అయిపోవడానికి కారణమేంటో తెలుసా? యాప్స్ వాడిన తర్వాత క్లియర్ చేయకపోవడం, అలాగే ఆటో అప్​డేట్​లో ఉంచడం వల్ల డేటా త్వరగా అయిపోతుంది. గూగుల్ ప్లే స్టోర్​లో యాప్​లకు అప్​డేట్ ఆప్షన్​ వచ్చిన వెంటనే యాప్​లు వాటంతటవే అప్​డేట్ అవుతుంటాయి. దీంతో డేటా ఖర్చు అవుతూ ఉంటుంది. 

అందుకని మొబైల్​లో యాప్స్ ఆటో అప్​డేట్​లో ఉంటే ఆఫ్​ చేయాలి. తద్వారా డేటా సేవ్ అవుతుంది. మీ స్మార్ట్​ ఫోన్​లో డేటా సేవర్​ మోడ్​ ఆఫ్​లో ఉంటే ఆన్​ చేసి ఉంచాలి. ఇది ఫోన్​లో రన్నింగ్​లో ఉన్న యాప్స్​కు డేటాను లిమిటెడ్​గా వెళ్లేలా చేస్తుంది. ఈ సెట్టింగ్ ఆండ్రాయిడ్, ఐఒఎస్​ రెండింటిలోనూ అందుబాటులో ఉంది. దీన్ని ఆన్​ చేయడానికి ఫోన్ సెట్టింగ్​లకు వెళ్లి నెట్​ వర్క్ అండ్ ఇంటర్నెట్​ ఆప్షన్​పై క్లిక్ చేయాలి. ఆపై డేటా సేవర్​ ఆన్​ చేయాలి. మామూలుగా అయితే యూట్యూబ్​ లేదా నెట్​ఫ్లిక్స్​లో చూసేటప్పుడు హైక్వాలిటీ పెట్టుకుంటుంటారు. 

దానివల్ల డేటా ఎక్కువ ఖర్చు అవుతుంది. డేటా సేవ్ చేయాలనుకుంటే 720pకి తగ్గించాలి. మొబైల్​లో డేటా లిమిట్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఆన్​లో ఉంచడం వల్ల డేటా ఆదా చేయొచ్చు. ఫోన్​లోని సెట్టింగ్స్​ ఓపెన్​ చేసి కనెక్షన్​లకు వెళ్లి డేటా యూజ్​ ఎంచుకోవాలి. దాంతో రోజూ ఎంత డేటా వాడాలో చూపిస్తుంది. అక్కడ లిమిట్ సెట్ చేయాలి. లిమిట్ దాటితే వార్నింగ్​ కూడా వస్తుంది. లేదా ఆటోమెటిక్​గా డేటా ఆఫ్​ అవుతుంది.