గవర్నమెంట్​ స్కూల్స్​లో డిజిటల్​ పాఠాలు

గవర్నమెంట్​ స్కూల్స్​లో డిజిటల్​ పాఠాలు

జనగామ అర్బన్​, వెలుగు:  తెలంగాణ వ్యాప్తంగా గవర్నమెంట్​ స్కూల్స్ లో  ఈ నెల 20 నుంచి డిజిటల్​ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులతోపాటు షెడ్యూల్​ను స్టేట్​ఇన్​స్టిట్యూట్​ఆఫ్​ఎడ్యుకేషన్​ టెక్నాలజీ(ఎస్ఐఈటీ) ​ డైరెక్టర్​ శుక్రవారం విడుదల చేశారు. డిజిటల్​తరగతులు ప్రారంభించేందుకు అవసరమైన అన్ని చర్యలను రాష్ట్రంలోని 31 జిల్లాల డీఈవోలు తీసుకోవాలని ఆదేశించారు. గవర్నమెంట్​ స్కూల్స్​లో డిజిటల్​ తరగతుల నిర్వహణ కోసం టీసాట్(విద్యా) చానెల్  టీచర్స్, స్టూడెంట్స్​కు​ అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.  ఎస్ఐఈటీ అధికారులు జూన్​ నెలలో 9 రోజుల పాటు డిజిటల్​తరగతులు నిర్వహించడానికి అవసరమైన టైం టేబుల్​ప్రిపేర్​ చేశారు. ప్రతిరోజు ఉదయం 10.40 నుంచి మధ్యాహ్నం 3.35 వరకు (మధ్యలో విరామం ఇస్తూ) 6,7,8,9,10 తరగతుల స్టూడెంట్లకు ఇంగ్లీష్​, హిందీ, ఫిజికల్​ సైన్స్, బయలాజికల్​ సైన్స్, సోషల్​స్టడీస్​ సబ్జెక్టులతో పాటు పర్సనాలిటీ డెవలప్​మెంట్​ క్లాస్​లను డిజిటల్​ తరగతుల ద్వారా స్టూడెంట్స్​కు చూపించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలతో రాబోయే రోజుల్లో గవర్నమెంట్​ స్కూల్స్​లో ప్రైవేట్​స్కూళ్లకు దీటుగా డిజిటల్​ క్లాస్​లు మారుమోగనున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా గవర్నమెంట్​ స్కూల్స్​లో చదువుతున్న స్టూడెంట్లు సబ్జెక్ట్​ కంటెంట్​అర్థం చేసుకోవడంతోపాటు ఎగ్జామ్స్​లో ఉత్తమ ఫలితాలను సాధించే  దిశగా అడుగులు వేయడానికి అవకాశం కలుగుతుంది.