Zimbabwe T20 tri-series: రేపే జింబాబ్వే, న్యూజిలాండ్, సౌతాఫ్రికా ట్రై సిరీస్.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు!

Zimbabwe T20 tri-series: రేపే జింబాబ్వే, న్యూజిలాండ్, సౌతాఫ్రికా ట్రై సిరీస్.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు!

సోమవారం (జూలై 14) నుంచి జింబాబ్వేలో టీ20 ముక్కోణపు సిరీస్ ప్రారంభం కానుంది. ఆతిధ్య జింబాబ్వేతో పాటు న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా మరో రెండు జట్లు ఈ ట్రై సిరీస్ ఆడనున్నాయి. సోమవారం తొలి మ్యాచ్ లో జింబాబ్వే, సౌతాఫ్రికా తలపడనున్నాయి. అన్ని మ్యాచ్‌లు హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరుగుతాయి. సాయంత్రం 4:30 గంటలకు మ్యాచ్ లు ప్రారంభమవుతాయి. ఈ ట్రై-సిరీస్ లో భాగంగా  మొత్తం ఏడు మ్యాచ్ లు జరుగుతాయి. మూడు జట్లు మిగిలిన రెండు జట్లతో రెండుసార్లు తలపడతాయి. టాప్- 2 లో ఉన్న జట్లు ఫైనల్ కు చేరుతాయి. జూలై 26 (శనివారం) ఫైనల్ జరుగుతుంది. 

ఫేవరేట్ గా కివీస్: 

ముక్కోణపు సిరీస్ కోసం న్యూజిలాండ్ సీనియర్ బ్యాటర్ విలియంసన్ కు జట్టులో చోటు దక్కలేదు. ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నే కివీస్ జట్టులోకి  ఇవ్వగా.. దేశవాళీ క్రికెట్ లో తన పవర్ హిట్టింగ్ తో సంచలనంగా మారిన బ్యాటర్ బెవాన్ జాకబ్స్‌కు ఛాన్స్ దక్కింది. 15 మంది సభ్యుల జట్టుకు మిచెల్ సాంట్నర్ కెప్టెన్సీ చేస్తాడు. కివీస్ కొత్త ప్రధాన కోచ్ రాబ్ వాల్టర్ 2026 టీ20 వరల్డ్ కప్ కు ఈ సిరీస్ తో సన్నాహాలు ప్రారంభిస్తాడు. వర్క్ లోడ్ కారణంగా పేసర్ లాకీ ఫెర్గూసన్ కు రెస్ట్ ఇచ్చారు. 

కైల్ జెమీసన్ వ్యక్తిగత కారణాల వలన ఈ సిరీస్ ఆడడం లేదు. గాయం కారణంగా బెన్ సియర్స్ సెలక్ట్ చేయలేదు. పేలవ ఫామ్ తో ఉన్న   డెవాన్ కాన్వేకు ఫిన్ అలెన్ కు గాయమవడంతో చోటు దక్కింది. వికెట్ కీపర్ బ్యాటర్ మిచ్ హేకు నిరాశే మిగిలింది. టిమ్ సీఫెర్ట్ వికెట్ కీపర్ గా సెలక్ట్ చేశారు. ఐపీఎల్ కమిట్ మెంట్ ల కారణంగా పాకిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్ కు దూరమైన గ్లెన్ ఫిలిప్స్, రచీన్ రవీంద్ర, సాంట్నర్ లాంటి కీలక ఆటగాళ్లు న్యూజిలాండ్ జట్టులో తిరిగి వచ్చారు. జూలై 16న హరారేలో దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ తమ తొలి టీ20 మ్యాచ్ ఆడుతుంది. 

కొత్త కుర్రాళ్లతో సఫారీలు: 

సౌతాఫ్రికా రెగ్యులర్ కెప్టెన్ మార్కరం ఈ సిరీస్ కు దూరంగా ఉన్నాడు. అనుభవజ్ఞుడు రాస్సీ వాన్ డెర్ డస్సెన్ సఫారీ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. కార్బిన్ బాష్, లువాన్-డ్రే ప్రిటోరియస్, రూబిన్ హెర్మాన్, సెనురాన్ ముత్తుసామి తొలిసారి సఫారీ జట్టుకి ఎంపికయ్యారు. ఇటీవలే టీ20 క్రికెట్ లో తన సంచలన బ్యాటింగ్ తో అదరగొట్టిన డెవాల్డ్ బ్రెవిస్ సౌతాఫ్రికా జట్టులో స్థానం సంపాదించాడు. గాయం నుంచి కోలుకున్న ఫాస్ట్ బౌలర్లు జెరాల్డ్ కోట్జీ,  నాండ్రే బర్గర్ జట్టులో చేరారు. జూలై 14 న ఆతిధ్య జింబాబ్వేతో సౌతాఫ్రికా తమ తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది.

సంచలనాలకు సిద్ధమైన జింబాబ్వే 

ఆతిథ్య జింబాబ్వే తమ 16 మంది సభ్యుల జట్టును సికిందర్ రజా నడిపించనున్నాడు. కీలక పేసర్లు రిచర్డ్ న్గారవ, బ్లెస్సింగ్ ముజరబానిలతో పాటు ఆల్ రౌండర్ బ్రియాన్ బెన్నెట్ జట్టులోకి తిరిగి వచ్చారు. సొంతగడ్డపై సంచలనాలు సృష్టించడానికి జింబాబ్వే సిద్ధంగా ఉంది. 

జింబాబ్వే T20 ట్రై-సిరీస్ 2025 కోసం దక్షిణాఫ్రికా జట్టు

దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు : రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, నాండ్రే బర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, రీజా హెండ్రిక్స్, రూబిన్ హెర్మన్, జార్జ్ లిండే, క్వేనా మఫాకా, సెనురాన్ ముత్తుసామి, లుంగి ఎన్గిడి, న్కాబా పీటర్, లువాన్-ఇలాస్, ప్రిన్సీ

ట్రై సిరీస్ కు న్యూజిలాండ్ జట్టు: 

మిచ్ సాంట్నర్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, బెవాన్ జాకబ్స్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రాచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి

ట్రై సిరీస్ కు జింబాబ్వే జట్టు: 

సికందర్ రజా (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, ట్రెవర్ గ్వాండు, క్లైవ్ మదాండే, వెస్లీ మాధేవెరే, టినోటెండా మపోసా, వెల్లింగ్‌టన్ మసకద్జా, విన్సెంట్ మసెకేసా, టోనీ మునియోంగా, తషింగా ముసెకివా, బ్లెస్సింగ్ ముజరవామ్, డ్డియన్ ముజారబానీ, తఫద్జ్వా త్సిగా.

ముక్కోణపు టీ20 సిరీస్ షెడ్యూల్:

మొదటి టీ20, 14 జూలై - జింబాబ్వే vs దక్షిణాఫ్రికా, హరారే స్పోర్ట్స్ క్లబ్
రెండవ టీ20, 16 జూలై - దక్షిణాఫ్రికా vs న్యూజిలాండ్, హరారే స్పోర్ట్స్ క్లబ్
3వ టీ20, 18 జూలై - జింబాబ్వే vs న్యూజిలాండ్, హరారే స్పోర్ట్స్ క్లబ్
4వ టీ20, 20 జూలై - జింబాబ్వే vs సౌతాఫ్రికా, హరారే స్పోర్ట్స్ క్లబ్
5వ టీ20, 22 జూలై - న్యూజిలాండ్ vs దక్షిణాఫ్రికా, హరారే స్పోర్ట్స్ క్లబ్
6వ టీ20, 24 జూలై - జింబాబ్వే vs న్యూజిలాండ్, హరారే స్పోర్ట్స్ క్లబ్
ఫైనల్, 26 జూలై - ఫైనల్,  హరారే స్పోర్ట్స్ క్లబ్

లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?
 
జింబాబ్వే టీ20 ట్రై-సిరీస్ 2025 ప్రత్యక్ష ప్రసారం ఇండియాలో ఫ్యాన్‌కోడ్, వెబ్‌సైట్ లో ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ఇండియాలోని ఏ టీవీ ఛానెల్‌లోనూ ఈ సిరీస్ ప్రత్యక్ష ప్రసారం ఉండదు.