లక్షన్నర బిల్లు కట్టకపోగా.. పవర్ కట్ చేశారని ట్రాన్స్ఫార్మర్నే ఎత్తుకెళ్లి కనెక్షన్ ఇచ్చుకున్నాడు !

లక్షన్నర బిల్లు కట్టకపోగా.. పవర్ కట్ చేశారని ట్రాన్స్ఫార్మర్నే ఎత్తుకెళ్లి కనెక్షన్ ఇచ్చుకున్నాడు !

ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ కు దాదాపు లక్షన్నర రూపాయలు బాకీ ఉన్నాడు. ఎన్ని సార్లు బిల్లు పంపినా చెల్లించలేదు. అధికారుల హెచ్చరికలను లెక్క చేయకుండా తన వ్యవసాయం తను చేసుకుంటున్నాడు. బిల్లు కట్టడంలేదని కరెంట్ కట్ చేస్తే.. ఏకంగా ట్రాన్స్ ఫార్మర్ ఎత్తుకొచ్చి కరెంటు సప్లై ఇచ్చుకున్నాడు. దర్జాగా పబర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ట్రాన్స్ ఫార్మర్ ఎత్తుకురావడం చర్చనీయాంశంగా మారింది. 

మధ్యప్రదేశ్ లోని భిండ్ జిల్లా రావత్ పుర గ్రామానికి చెందిన శ్రీరామ్ బిహారీ త్రిపాఠి అనే వ్యక్తి.. 25 కిలో వాట్ల ట్రాన్స్ ఫార్మర్ ను ఎత్తుకెళ్లటం సంచలనంగా మారింది. వ్యవసాయ అవసరాల కోసం ప్రభుత్వ స్కీమ్ కింద ఇచ్చిన ట్రాన్స్ ఫార్మర్ ను కొడుకు సోను త్రిపాఠి సహాయంతో ఎత్తుకెళ్లాడు. డిస్కం కు చెందిన ట్రాన్స్ ఫార్మర్ ను కనెక్షన్ తీసేసి ఎత్తుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. 

ALSO READ | పెద్దపల్లిలో మరో అవినీతి చేప..రూ. 90 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన ఏఈ

ఆస్వర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అసిస్టెంట్ మేనేజర్ అభిషేక్ సోనీ పోలీస్ కంప్లైంట్ లో పేర్కొన్న వివరాల ప్రకారం.. నిందితుడు  రూ.1,49,795  రూపాయల కరెంటు బిల్లులు బకాయి పడ్డాడు. ట్రాన్స్ ఫార్మర్, కరెంటు కనెక్షన్ తీసేస్తారని ముందుగానే కరెంట్ లైన్లను ఇంటి వ ద్ద పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుని దగ్గర నుంచి ట్రాన్స్ ఫార్మర్ ను స్వాధీనం చేసుకుని  డిస్కం కు అప్పగిస్తామని చెప్పారు. 

చట్టానికి భయపడి.. నైతికంగా చెడ్డపేరు రావద్దని చాలా మంది బిల్లులు కడుతుంటారు. కానీ.. ఎలాంటి భయం లేకుండా.. కేసులు అవుతాయనే బెరుకు లేకుండా ఏకంగా డిస్కం నుంచే ట్రాన్స్ ఫార్మర్ ఎత్తుకెళ్లడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.