
అవినీతి అధికారులపై రాష్ట్ర ఏసీబీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించిన అధికారులను అరెస్ట్ చేస్తున్నారు. ఆకస్మిక తనిఖీలతో అవినీతి అధికారులను కట్టడి చేస్తున్నారు .
పెద్దపల్లి జిల్లాలో కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో కాంట్రాక్టర్ దగ్గర నుంచి రూ. 90 వేలు లంచం తీసుకుంటుండగా ఏఈ జగదీష్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఓదెల మండలం బాయమ్మ పల్లెకు చెందిన కాంట్రాక్టర్ కావటి రాజు మండలంలోని వెన్నంపల్లి గ్రామంలో రూ.15 లక్షలతో సీసీ రోడ్లు పనులు చేయగా బిల్లుల కోసం ఏఈ జగదీష్ కాంట్రాక్టర్ ను లక్ష రూపాయలు డిమాండ్ చేయగా..రూ. 90 వేలకు ఒప్పందం కుదిరింది . దీంతో బాధితుడు కాంట్రాక్టర్ కావేటి రాజు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రక్కన ఉన్న ప్రధాన రహదారిపై కారులో కాంట్రాక్టర్ కావటి రాజు రూ. 90 వేలు ఏఈ జగదీష్ కు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
►ALSO READ | దేశ్ కీ నేత ప్రకటనలకు రూ.266 కోట్లు.. టీఆర్ఎస్.. బీఆర్ఎస్ గా మారినప్పుడు రూ. 244.17 కోట్ల ప్రకటనలు
జులై 7న నల్లగొండ డీఎస్ఓ కార్యాలయంలో రూ.. 70 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా మిర్యాలగూడ సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ షేక్ జావీద్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు.
జూలై 10న జహీరాబాద్ నిమ్జ్ కార్యాలయంలో డిప్యూటీ కలెక్టర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. భూసేకరణ పరిహారం చెక్కులు ఇచ్చేందుకు రూ.65 వేలు లంచం తీసుకుంటుండగా నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్ రాజు, డిప్యూటీ తహశీల్దార్ సతీష్ ఏసీబీకి దొరికారు.