ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, సోషల్ మీడియా, నోటిఫికేషన్లు మన దైనందిన జీవితంలో భాగమైపోయాయి. చాలా మంది గంటల తరబడి ఫోన్ స్క్రీన్‌లకే పరిమితమవుతున్నారు. నిరంతరం ఆన్‌లైన్‌లో ఉండటం వల్ల మానసిక అలసట, ఒత్తిడి, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నపాటి డిజిటల్ డిటాక్స్ అలవాట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని సూచిస్తున్నారు.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం..నిద్రలేచిన వెంటనే ఫోన్ చెక్ చేయకుండా మొదటి 30 నిమిషాలు ప్రశాంతంగా గడపడం, భోజనం సమయంలో ఫోన్‌ను దూరంగా పెట్టడం, కుటుంబ సభ్యులతో మాట్లాడటం వంటి అలవాట్లు మానసిక ప్రశాంతతను పెంచుతాయి. అలాగే సమీపంలోని పార్కు లేదా తోటలో నడకకు వెళ్లడం, పుస్తకాలు చదవడం, తోటపని, వంట, స్కెచింగ్ వంటి అభిరుచులకు సమయం కేటాయించడం ద్వారా స్క్రీన్ టైమ్‌ను తగ్గించుకోవచ్చు.
►ALSO READ | సిగరెట్ మానేస్తే మీ శరీరంలో ఎం జరుగుతుందో తెలుసా.. ఆరు గంటల తరువాత జరిగేది ఇదే..
అనవసరమైన సోషల్ మీడియా, షాపింగ్ యాప్ నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయడం కూడా ఫోన్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. వారాంతంలో కనీసం ఒక సాయంత్రం పూర్తిగా స్క్రీన్‌లకు దూరంగా గడపడం, కుటుంబంతో కలిసి ఆటలు ఆటలు, ప్రత్యేక వంటకాలు తయారు చేయడం వంటివి చేస్తే ఎంతో ప్రయోజనం అని నిపుణులు చెబుతున్నారు.
ఇక సోషల్ మీడియాను రోజంతా చెక్ చేయకుండా, ఓ స్పెషల్ టైం పెట్టుకుని మాత్రమే ఉపయోగించే అలవాటు చేసుకుంటే అనవసరమైన స్క్రోలింగ్ తగ్గుతుంది. చిన్నచిన్న మార్పులతోనే డిజిటల్ ప్రపంచానికి కొంత విరామం ఇచ్చి, నిజ జీవితంలోని ఆనందాలను మరింతగా ఆస్వాదించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
