పొగ తాగడం ఎంత సులువో.. దాన్ని మానడం అంతకంటే కష్టం అనేది చాలా మంది మాట. కానీ ఒక్కసారి గట్టిగా మనసు నిబ్బరం చేసుకుని సిగరెట్‌ను పక్కన పెడితే.. మన శరీరం అద్భుతమైన రీతిలో కోలుకోవడం ప్రారంభం అవుతుంది. సిగరెట్ మానేసిన కేవలం ఆరు గంటల నుంచే శరీరంలో అద్భుతమైన మార్పులు మొదలవుతాయి. రాబోయే ఐదు, పది, పదిహేనేళ్లలో మీ గుండె, ఊపిరితిత్తులు మళ్లీ మునుపటిలా ఆరోగ్యంగా ఎలా మారతాయో.. ఆ ప్రాసెస్ ఏంటో, పొగ భూతాన్ని తరిమికొట్టే సులువైన మార్గాలు ఇప్పుడు చూద్దాం...
సిగరెట్ మానేసిన ఆరు గంటల తర్వాత శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయి. "మూడు నెలల్లో గొంతు, ఊపిరితిత్తుల నొప్పులు తగ్గుతాయి. తొమ్మిది నెలల్లో దగ్గు, ఆయాసం కూడా కంట్రోల్ అవుతాయి. ఐదేంద్ర తర్వాత పెరాలసిస్ స్టోక్స్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
ALSO READ : క్యాన్సర్ తగ్గాక కూడా మళ్లీ సిగరెట్టా ?
పదేండ్లలో ఊపితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశాలు 50 శాతం, పదిహేనేండ్ల తర్వాత గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
అందుకని వీలైనంత త్వరగా పొగ భూతాన్ని వదలాలి. మీ వల్ల కావట్లేదంటే కౌన్సెలర్ని కలవాలి. వాళ్లు ఆ అలవాటు మానడానికి నికోటిన్ బబుల్ గమ్స్, ప్యాచ్లు ఇస్తారు. నెల రోజుల తర్వాత వాటి డోస్ తగ్గిస్తారు. అయితే ఈ ప్రాసెస్ అంత తేలికని చెప్పలేం. పొగ మానేస్తే చిరాకు, కోపం, నిస్సహాయత కనిపిస్తాయి. ఎలాగైనా మానాలన్న పట్టుదల ఉంటేనే పొగ మత్తు నుంచి బయటపడతారు.
