NRI డాక్టర్లతో డిజిటల్ ఫ్లాట్ ఫాం: సీఎం రేవంత్ రెడ్డి

NRI డాక్టర్లతో డిజిటల్ ఫ్లాట్ ఫాం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: అందరికీ మెరుగైన విద్య, వైద్యం మా లక్ష్యం అని.. ఆ దిశగా అన్ని చర్యలను చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో మాట్లాడిన సీఎం.. వైద్య రంగంలో తీసుకొస్తున్న విప్లవాత్మకమైన మార్పులకు సంబంధించిన కీలక అంశాలను వెల్లడించారాయన.

విదేశాల్లో స్థిరపడిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది డాక్టర్లు ఉన్నారని.. వాళ్లందరితో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఓ డిజిటల్ ప్లాట్ ఫాం క్రియేట్ చేయబోతున్నట్లు వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన సమయంలో.. వాళ్ల సేవలను ఉపయోగించుకోవటానికి ఇది ప్లాట్ ఫాం ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. NRI డాక్టర్లు రాష్ట్రానికి వచ్చిన సమయంలో.. తీరిక సమయంలో.. వాళ్లకు సమయం ఉన్నప్పుడు.. వాళ్ల అనుభవాలను ఉపయోగించుకునే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు వివరించారు సీఎం రేవంత్ రెడ్డి.

NRI డాక్టర్లతో రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో టీచింగ్ చేప్పొచ్చని.. అరుదైన, కీలకమైన చికిత్సలకు సంబంధించి చర్చలు జరపొచ్చని.. ఇక్కడి ఆస్పత్రుల్లో కొన్ని రోజులు సేవలు అందించే విధంగా అద్భుతమైన ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. దీని వల్ల విదేశాల్లో వైద్య విధానం ఎలా ఉంది.. ఇక్కడ ఎలాంటి మార్పులు తీసుకురావొచ్చు అనే విషయాలపై స్పష్టత వస్తుందని.. పరిశోధనలకు ఎంతో ఉపయోగపడుతుందని స్పష్టం చేశారాయన. 

NRI డాక్టర్లు అందర్నీ కలిపే విధంగా ఓ డిజిటల్ ఫ్లాట్ ఫాం అనేది త్వరలోనే రాబోతున్నదని.. దీనికి సంబంధించి పనులు జరుగుతున్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వైద్య రంగంపై చిత్తశుద్ధితో పని చేస్తున్నామని.. కాలానికి తగ్గట్టు మార్పులు తీసుకొస్తూ.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.