వరల్డ్‌‌వైడ్‌‌గా రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు.. మిరాయ్‌‌ టీమ్‌‌కు దిల్ రాజు అభినందనలు

వరల్డ్‌‌వైడ్‌‌గా రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు.. మిరాయ్‌‌ టీమ్‌‌కు దిల్ రాజు అభినందనలు

తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వ ప్రసాద్  నిర్మించిన ‘మిరాయ్‌‌’ చిత్రం సెప్టెంబర్ 12న విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.  తాజాగా నిర్మాత దిల్ రాజు ‘మిరాయ్’ టీమ్‌‌ను  అభినందించారు. ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకొని  హీరో తేజ సజ్జా  కోసం తమ ఇంట్లో ఆత్మీయ  వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తేజతోపాటు డైరెక్టర్ కార్తీక్  పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు.  ఈ చిత్రం ఇప్పటికే వరల్డ్‌‌వైడ్‌‌గా రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. నార్త్ అమెరికాలో 3 మిలియన్ డాలర్ల మార్క్‌‌ని దాటింది.