DilRajuDreams: టాలెంట్ ఉండి సరైన ప్లాట్‌ఫామ్‌ లేదా.. కొత్త ప్రతిభకు దిల్‌రాజు డ్రీమ్స్ ఆన్‌లైన్ పోర్టల్ రెడీ

DilRajuDreams: టాలెంట్ ఉండి సరైన ప్లాట్‌ఫామ్‌ లేదా.. కొత్త ప్రతిభకు దిల్‌రాజు డ్రీమ్స్ ఆన్‌లైన్ పోర్టల్ రెడీ

టాలెంట్ (TALENT) ఉండి అవకాశం రాక ఎంతోమంది బయట కష్టపడుతున్నారు. అది సినీరంగంలోనే కాదు ప్రతిఒక్క రంగంలోనూ. ఆ టాలెంట్ను గుర్తించి అవకాశం, ఇవ్వడానికి సమాజంలో ఏ ఒక్కరూ నిజాయితీగా ముందుకురారు. ఎందుకంటే, డబ్బుండి, చెప్పుకోదగ్గ జీతం వచ్చే జాబ్ ఉంటేనే గౌరవించే రోజులివి. ఈ క్రమంలోనే 'అక్కరకు రాని టాలెంట్ ఉంటే ఏం లాభం చెప్పండి' అని అనుకునే పరిస్థితి కూడా ఎంతోమంది లక్ష్యం పెట్టుకున్న వారిలో వస్తోంది. అది కూడా తిరిగి.. తిరిగి, చివరి వరకు పోరాడి.. అలసిపోయిన క్షణంలో మదిలో పుడుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా..? అవసరమే. సినీ రంగంలో 24 క్రాఫ్ట్స్లో ఏదేని విభాగంలో ప్రతిభా ఉందా..? ఉంటే అవకాశం మిమ్మల్ని వరించినట్టే. ఒక అద్భుతమైన  ప్లాట్‌ఫామ్‌ మీ ముందున్నట్టే! వివరాల్లోకి వెళితే..  

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) కొత్త టాలెంట్ను పరిచయం చేసేందుకు సిద్ధమయ్యారు. లేటెస్ట్గా "దిల్ రాజు డ్రీమ్స్" (Dil Raju Dreams)అనే ప్లాట్‌ఫామ్‌ను లాంఛ్ చేశారు. జూన్ నుంచి ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి రానుంది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా యంగ్ టాలెంట్ను వెలికితీయనున్నాడు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన చేస్తూ టాలెంట్ ఉన్న వారికి ఆహ్వానం అందించారు.

"ఇది కొత్త ప్రతిభ కోసం సృష్టించబడిన వేదిక. సినిమా ప్రపంచంలోకి ఉత్తేజకరమైన కొత్త ప్రతిభను తీసుకువచ్చే స్థలాన్ని సృష్టించడానికి దిల్ రాజు డ్రీమ్స్ ఈ జూన్‌లో ప్రారంభించబడుతోంది. ఈవెంట్ కోసం రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు లింక్ అందుబాటులో ఉంది. ప్రతి ఆశావహ ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఆలోచనలను దిల్ రాజు డ్రీమ్స్లో పోస్ట్ చేయడానికి పోర్టల్ తెరిచి ఉంటుంది" అని వివరాలు వెల్లడించారు.  

జూన్ నెల నుంచి దిల్ రాజు డ్రీమ్స్ ఆన్ లైన్ ప్లాట్‌ఫామ్ యాక్టివ్ కానుంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో భాగం కావాలనుకునే వారు https://dilrajudreams.com/లింక్‌పై క్లిక్ చేసి తమ వివరాలను నమోదు చేస్తే, దిల్ రాజు డ్రీమ్స్ బృందం స్వయంగా వారిని సంప్రదిస్తుంది.   
టాలెంట్ ఉన్నా సినీ పరిశ్రమలో కాంటాక్ట్స్ లేక, ఎవరిని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నారు.

అలాంటివారి కోసం ముందుకొచ్చిన దిల్ రాజు ఆలోచన విధానం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? దిల్ రాజు డ్రీమ్స్ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకుని తమ కలను నిజం చేసుకొనుటకు సిద్ధం అవ్వండి.