Dil Raju: గుంటూరు కారం నెగిటివ్ టాక్పై..స్పందించిన దిల్ రాజు

Dil Raju: గుంటూరు కారం నెగిటివ్ టాక్పై..స్పందించిన దిల్ రాజు

మహేష్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ (Trivikram) కాంబోలో వచ్చిన గుంటూరు కారం (Guntur Kaaram) సంక్రాంతికి కానుకగా..థియేటర్లోకి వచ్చింది. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా అంటే..హై ఓల్టేజ్ ఎక్స్పర్టేషన్ వచ్చేసాయి. అతడు, ఖలేజా తరువాత..ఇద్దరి కలయికలో వస్తోన్నసినిమా కావడంతో..సంక్రాంతికి బొమ్మ బ్లాక్ బ్లస్టర్ అంటూ ఫ్యాన్స్ ఊగిపోయారు. 

అంతేకాదు టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ అంటేనే ఫ్యామిలీతో పాటు..కామెడీ ఉంటుంది కాబట్టి..సినిమా హిట్టే అంటూ అంచనాలు ముందే పెట్టుకున్నారు ఫ్యాన్స్. కానీ, ఒక్కసారి షోస్ పడ్డాక..సీన్ కాస్తా రివర్స్ అయింది. ఫ్యాన్స్ ఈ సినిమాకు నెగటివ్ టాక్ ఇస్తూ మేకర్స్పై మండిపడుతున్నారు. 

ఇవాళ గుంటూరు కారం సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమాపై వస్తోన్న నెగటివ్ టాక్పై దిల్ రాజు(Dil Raju) స్పందించారు. నైజాం సహా ఉత్తరాంధ్ర ప్రాంతంలో సినిమా డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ..గుంటూరు కారం సినిమాకి ఊహించని దానికంటే ఫస్ట్ డే కలెక్షన్స్ ఎక్కువ వచ్చాయని తెలిపారు. సినిమా బాగోలేదంట అనే మైండ్ సెట్తో ముందే థియేటర్స్కి వెళితే..సినిమా చూస్తే బాగోలేదని అనిపిస్తుంది. ఇది రియల్ పాజిటివ్ ఫిల్మ్ అని దిల్ రాజు చెప్పారు. 

ఫస్ట్ డే ప్రీమియర్స్ షోస్ తర్వాత సోషల్ మీడియాలో కాస్త మిక్స్డ్  రివ్యూస్ వచ్చాయి. నేను నాకు తెలిసిన వాళ్ళని అడిగే ప్రయత్నం చేస్తే చాలా మంది పర్వాలేదు, యావరేజ్ అన్నారు. కొంతమంది సినిమా బావుందన్నారు. కానీ నేను సినిమా చూసినప్పుడు పర్సనల్ ఏదైతే ఫీలయ్యానో..మళ్లీ దాన్ని క్రాస్ చెక్ చేసుకోవడానికి..నిన్న సుదర్శన్ థియేటర్కి వెళ్లి చూశాను. అయితే ఇది మహేష్ బాబు క్యారెక్టర్ ని బేస్ చేసుకుని తీసిన సినిమా ఇదని అనిపించింది. అంతేకాదు..తల్లి కొడుకుల ఫ్యామిలీ ఎమోషనల్ బాండింగ్ తో వచ్చిన సినిమా ఇది.

బాగాలేదు బాగాలేదు అని నెగిటివ్ కామెంట్స్ విని సినిమాకి వెళ్లిన వాళ్లు కూడా విషయం తెలుసుకుని మళ్ళీ కనెక్ట్ అవుతున్నారని చెప్పారు. గుంటూరు కారం ఈ సంక్రాంతికి వచ్చిన మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్..కుటుంబంతో హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేసే సినిమా ఇదని..నేను సుదర్శన్ థియేటర్ లో సినిమా చూస్తున్నప్పుడు కూడా అదే ఫీల్ అయ్యాను అంటూ వస్తోన్న విమర్శలపై దిల్ రాజు వివరించారు.