తప్పుడు రాతలు రాస్తే తాటతీస్తా..స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన దిల్ రాజు

తప్పుడు రాతలు రాస్తే తాటతీస్తా..స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన దిల్ రాజు

సినిమా వాళ్లకి సంక్రాంతి అనేది పెద్ద సీజన్. అందుకే ఈ సీజన్ కోసం పెద్ద హీరోలు సైతం సిద్దమవుతుంటారు. ఈ వార్ ప్రతీ సంవత్సరం ఉండేదే. అలాగే ఈ ఇయర్ కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ వార్ జరుగనుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు పెద్ద సినిమాలు ఈ సంక్రాంతికి పోటీపడనున్నాయి. ముందుగా ఐదు సినిమాలు పోటీలో నిలువగా..రవితేజ ఈగల్ మూవీ పోటీ నుండి తప్పుకుంది.

ఇలాంటి క్రమంలోనే కొన్ని సినిమాలకు థియేటర్లు దొరకడం లేదంటూ..కొంతమంది ప్రముఖులు అడ్డు పడుతున్నారని వస్తోన్న కామెంట్స్పై ప్రొడ్యూసర్ దిల్ రాజ్(Dil Raju) స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు. దిల్ రాజు మాట్లాడుతూ..ప్రతి సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి, అలా రిలీజ్ అవుతున్నప్పుడల్లా తెలివిగా అలోచించి, సినిమాలను సక్సెస్ బాటలోకి తీసుకురావడానికి చాలా కష్ట పడుతున్నాను. అలా కష్టపడి ఈ స్థాయికి వచ్చినందుకు..కొంతమంది డైరెక్ట్ గా ఇన్ డైరెక్ట్ గా ఏదో విధంగా నా మీద కాంట్రవర్సీలు చేస్తూనే వస్తున్నారు. ఇలా జరగడం ఫస్ట్ టైం కాదు..ఆల్మోస్ట్ ఏడెనిమిదేళ్ల నుంచి ఇలాంటి వార్తలు నాపై రాస్తూనే వస్తున్నారని దిల్ రాజు తెలిపారు. 

ఇక నిన్న(జనవరి 7న) జరిగిన హనుమాన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మెగాస్టార్ చిరంజీవి కూడా నాపై మాట్లాడిన మాటలను..తప్పుగా అర్ధం చేసుకుని..వాటిని కొన్ని వెబ్ సైట్లు తప్పుగా వక్రీకరిస్తూ వార్తలు రాస్తున్నారంటూ..ఇక మీదట ఇలాంటి తప్పుడు వార్తలు రాసే వెబ్ సైట్లపై చర్యలు తీసుకుంటానని తెలిపారు. అంతేకాదు..ఇలాంటి వార్తలు నాపై వచ్చిన ప్రతిసారి ఊరుకున్నా..ఇకపై ఊరుకోను..తాటతీస్తా అంటూ దిల్ రాజు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

నైజాం ఏరియాలో హనుమాన్ , గుంటూరు కారం సినిమాలకు థియేటర్లు అందుబాటులో ఉన్నాయని, నాగార్జున, వెంకటేశ్ సినిమాలకు మాత్రం థియేటర్లు దొరకడం లేదని..అందుకు తాము అడ్డ్డుపడుతున్నామని అన్నారు. ఇలాంటి మీ తప్పుడు రాతలతో ఏం చేద్దామనుకుంటున్నారు? నేను ఎప్పుడు అందుబాటులో ఉంటా కదా..ఏదైనా ఉంటే ముందుగా తనను సంప్రదించి వార్తలు జాగ్రత్తగా రాయాలని మీడియాని ఉద్దేశించి అన్నారు.