
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన సోదరుడు శిరిష్ కుమారుడు, హీరో ఆశిష్ పెళ్లికి రెడీ అయిపోయాడు. ఏపీకి చెందిన బిజినెస్ మెన్ కూతురు అద్వైత రెడ్డితో ఆశిష్ ఎంగేజ్‌మెంట్ జరిగింది. నవంబర్ 30న సీక్రెట్ గా ఈ వేడుక జరిగింది.
కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే ఈ వేడకను జరిగినట్లుగా సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆశిష్, అద్వైతల పెళ్లి జరగనుందని తెలుస్తోంది. ప్రస్తుతం వీరి ఎంగేజ్‌మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో సెలబ్రేటీలతో పాటుగా నెటిజన్లు వీరికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఇక ఆశిష్ సినిమాల విషమానికి వస్తే.. రౌడీ బాయ్స్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు ఆశిష్. ఈ సినిమాలో అతనికి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. సినిమా పెద్దగా హిట్ సాధించకపోయిన హీరోగా ఆశిష్ కు మంచి పేరును తీసుకువచ్చింది. విశాల్ కాశీ దర్శకత్వంలో సెల్ఫిష్ అనే సినిమా చేశాడు ఆశిష్. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.