పిల్లల ఎగ్జామ్స్ అయిపోయాయి.. సమ్మర్ సెలవులు మొదలవుతున్నాయి. మరో 20 రోజుల్లో అందరికీ వేసవి సెలవులు రాబోతున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది సమ్మర్ టూర్లకు ప్లాన్ చేసుకున్నారు. ఫ్యామిలీతో సమ్మర్ వెకేషన్ కోసం వెళ్లాలనే ఆలోచన.. ప్లానింగ్ చాలా రోజుల ముందు నుంచే ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. పెట్రోల్, డీజిల్ కొరత ఉన్న క్రమంలో ఈసారి సమ్మర్ టూర్ వెళ్లాలా వద్దా అనే డైలమా ఫ్యామిలీల్లో నెలకొంది.
వారం రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇక మార్చి 25వ తేదీ నుంచి హైదరాబాద్ సిటీలో చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఒక వైపు ఇంధన కొరత లేదని ఆయిల్ కంపెనీలు, అసోసియేషన్స్ ప్రకటిస్తున్నా.. జనంలో మాత్రం భయం తగ్గటం లేదు. దీనికితోడు జపాన్, ఫిలిప్పిన్స్ దేశాలు ఇంధన ఎమర్జెన్సీ ప్రకటించాయి. ఇక ఇండియాలోనూ తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో చాలా బంకుల్లో పెట్రోల్ కొరత ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి టైంలో ఈసారి సమ్మర్ టూర్ వెళ్లాలా వద్దా అనే డైలమా ఏర్పడింది.
ఎగ్జాంపుల్ హైదరాబాద్ సిటీ నుంచి బయలుదేరారు అనుకుంటే.. ఇక్కడ పెట్రోల్ ఓకే.. మార్గ మధ్యలో బంకుల్లో పెట్రోల్, డీజిల్ దొరుకుతుందా లేదా అనే సందేహాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి. కొంత మంది సొంత వాహనాల్లో వెళతారు.. మరికొంత మంది రైళ్లు.. బస్సుల్లో వెళతారు.. మరికొంత మంది విమానాల్లో వెళతారు. ఎవరు ఎందులో వెళ్లినా ఆయా ప్రాంతాల్లో తిరగటానికి లోకల్ వెహికల్స్ మస్ట్ కదా.. అక్కడ వాళ్లకు ఇంధనం కావాలి కదా.. ఇలాంటి సంక్షోభం సమయంలో సమ్మర్ టూర్ ప్లాన్ చేసుకున్న వాళ్లు.. వెళ్లాలా వద్దా అనే డైలమాలో పడ్డారు. సెంట్రల్ బోర్డు టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాయి.. స్టేట్ బోర్డు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మరో వారం, 10 రోజుల్లో టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ మొత్తం కంప్లీట్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే చాలా ఫ్యామిలీలు సమ్మర్ వెకేషన్ కోసం ప్లాన్ చేసుకున్నాయి.
►ALSO READ | పెట్రోల్ కోసం వర్రీ ఎందుకు.. హైదరాబాదీలకు ఆర్టీసీ బంపర్ ఆఫర్!
కొంత మంది 2 నెలల ముందే రైళ్లు, విమానాల్లో అడ్వాన్స్ టికెట్లు బుక్ చేసుకున్నారు. మరికొందరు సొంత వాహనాల్లో వెళ్లేందుకు ప్లాన్ చేసేసుకుని ఉన్నారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా నెలకొన్న ఇంధన కొరతతో అయోమయంలో పడ్డారు. మరీ ముఖ్యంగా.. కరోనా లాంటి సంక్షోభం రాబోతున్నదని.. ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోడీ ప్రకటన తర్వాత.. సమ్మర్ పర్యటనలపై ఫ్యామిలీలు పూర్తిగా డైలమాలో పడ్డారు.
