ఆయనతో పాటు 17 మందితో కేబినెట్
మంత్రులతో ప్రమాణం చేయించిన ప్రెసిడెంట్
కొలంబో: శ్రీలంక కొత్త ప్రధానిగా దినేశ్ గుణవర్ధన నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు 17 మంది క్యాబినెట్సభ్యులతో ప్రెసిడెంట్ రణిల్ విక్రమసింఘే శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయించారు. గుణవర్దనతో కలిపి క్యాబినెట్లో మొత్తం 18 మంది సభ్యులు ఉన్నారు. అధ్యక్షుడిగా రణిల్ బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రణిల్మాట్లాడుతూ దేశాన్ని గత కొద్ది నెలలుగా పట్టిపీడిస్తున్న రాజకీయ, ఆర్థిక సంక్షోభం త్వరలోనే అంతమవుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశం ఎన్నడూ చూడని ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని, ఆ పరిస్థితిని చక్కదిద్దడానికి అన్ని పార్టీలతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాను చర్యలు తీసుకున్నానని ఆయన చెప్పారు. కాగా ప్రధాని గుణవర్దనకు అదనంగా పబ్లిక్అడ్మినిస్ట్రేషన్, హోం అఫైర్స్, ప్రావిన్షియల్కౌన్సిల్, స్థానిక ప్రభుత్వాల పోర్ట్‌ఫోలియోలను అప్పగించారు. ఇంతకుముందు ఆర్థిక మంత్రిగా పనిచేసిన అలీ సాబ్రీని ఫారెన్మినిస్టర్గా నియమించారు. విక్రమసింఘే ఆర్థికశాఖ బాధ్యతలు తీసుకున్నారు. ఇక మిగతా మెంబర్లకు ఇంతకుముందు వారు చేపట్టిన పదవులనే ఇచ్చారు. కాగా మాజీ ప్రెసిడెంట్గోటబయ రాజపక్స దేశం నుంచి పారిపోయి రాజీనామా చేశాక.. ప్రధానిగా ఉన్న రణిల్విక్రమసింఘే గురువారం అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. దీంతో ఖాళీగా ఉన్న ప్రధాని పదవిలో దినేశ్ గుణవర్దనను నియమించారు.
గుణవర్దన ప్రస్థానం
1949 మార్చి 2న గుణవర్దన జన్మించారు. ఫారిన్, ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా పనిచేశారు. అప్పటి ప్రెసిడెంట్గోటయ రాజపక్స ఏప్రిల్‌లో ఆయనను హోం మినిస్టర్‌గా నియమించారు. ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేకు ఆయన స్కూల్‌మేట్. నెదర్లాండ్స్‌లో ఉన్నత విద్య అభ్యసించారు. 1979లో స్వదేశానికి తిరిగివచ్చారు. కొలంబో సబర్బ్నుంచి ఎన్నికై 1983లో మొదటిసారిగా పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు.
