
కామారెడ్డి, వెలుగు: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలు, ఏటీసీల్లో వివిధ రకాల ట్రేడ్లలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీని నాల్గొ విడతలో నేరుగా అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు బిచ్‌కుంద్ కాలేజీ ప్రిన్సిపాల్, కన్వీనర్ ప్రమోద్‌కుమార్ రెడ్డి తెలిపారు. అడ్మిషన్లు ఈ నెల 30 మధ్యాహ్నం 1 గంట వరకు తీసుకుంటామని తెలిపారు.
ఎస్సెస్సీ ఫాసైన అభ్యర్థులు చేరవచ్చని, కొత్తగా చేరే వారు ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాలన్నారు. ఇప్పటికే 1, 2, 3 విడతల్లో అప్లై చేసినవారు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదన్నారు. మూడు విడతల్లో సీటు పొందని అభ్యర్థులు నేరుగా ఏటీసీలు, ఐటీఐలకు వచ్చి అడ్మిషన్లు పొందవచ్చని, అడ్మిషన్ల కోసం ఆన్‌లైన్ తప్పనిసరి అని పేర్కొన్నారు.
ఇంటర్నెట్ సెంటర్స్ అందుబాటులో లేని సందర్భంలో, ఒరిజినల్ సర్టిఫికెట్లను ఐటీఐలకు తీసుకెళితే ఆన్‌లైన్ అప్లికేషన్ అక్కడే చేయవచ్చని తెలిపారు. బిచ్‌కుంద్, తాడ్వాయి, ఎల్లారెడ్డి ఏటీసీల్లో ఖాళీ సీట్లు ఉన్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు ఆన్‌లైన్ లేదా 8500463363, 9989946678 ద్వారా సంప్రదించవచ్చని సూచించారు.