Ravi teja, Anudeep: రవితేజ సినిమాకి మోహన్ బాబు టైటిల్.. ఈసారి మరింత క్రేజీగా వస్తున్న అనుదీప్

Ravi teja, Anudeep: రవితేజ సినిమాకి మోహన్ బాబు టైటిల్.. ఈసారి మరింత క్రేజీగా వస్తున్న అనుదీప్

జాతిరత్నాలు(Jathirathnalu) సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపుకు తిప్పుకున్నాడు యంగ్ డైరెక్టర్ అనుదీప్ కేవీ(Anudeep KV). నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాంబోలో వచ్చిన సూపర్ ఫన్ ఎంటర్టైనర్ ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించింది. ఈ ముగ్గురు స్టార్స్ తో అనుదీప్ చేయించిన హంగామా అంతా ఇంతా కాదు. దాంతో.. కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో రాబట్టింది ఈ మూవీ. ఈ సినిమా తరువాత తమిళ స్టార్ శివ కార్తీకేయన్ తో ప్రిన్స్ మూవీ చేశాడు అనుదీప్. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేదు. 

ఇక దాదాపు రెండేళ్ల గ్యాప్ తరువాత మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు అనుదీప్. ఈసారి ఎంటర్టైన్మెంట్ కేరాఫ్ గా చెప్పుకునే మాస్ మహారాజ్ రవితేజ(RaviTeja)తో తన నెక్స్ట్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. చాలా కాలంగా ఈ కాంబోలో సినిమాపై వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, అధికారిక ప్రకటన మాత్రం రావడంలేదు. తాజాగా ఈ సినిమా గురించి మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఆడెనటంటే..  ఈ సినిమాకు మెహన్ బాబు సూపర్ హిట్ సినిమా టైటిల్ దొంగ పోలీస్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. టైటిల్ కు తగ్గట్టుగానే రవితేజ ఈ సినిమాలో దొంగ పోలీస్ గా డ్యూయల్ రోల్ చేస్తున్నాడట. ఇంకేముంది.. ఎంటర్టైన్మెంట్ డబల్ ఇంపాక్ట్ ఉంటుందని క్లియర్ గా అర్థమవుతోంది. స్క్రీన్ పైన ఒక రవితేజ ఉంటేనే ఆ రచ్చ మాములుగా ఉండదు.. అలాంటిది ఇద్దరు అంటే, వారికి  అనుదీప్ కలిశాడంటే ఆ హంగామా నెక్స్ట్ లెవల్లో ఉండటం ఖాయం. అందుకే ఈ కాంబోలో సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొంటున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుంది.