
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా ఎ.ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం తిరగబడర సామి. సురక్ష ఎంటర్టైన్మెంట్ మీడియా బ్యానర్పై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
లేటెస్ట్గా ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ ఎ.ఎస్ రవికుమార్..హీరోయిన్ మన్నారచోప్రా భుజంపై చెయ్యేసి ముద్దు పెట్టుకున్నారు. హీరోయిన్ మన్నారచోప్రా స్మైల్ ఇస్తూ రియాక్ట్ అవ్వగా.. ఆడియన్స్ మాత్రం డైరెక్టర్ పై భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. ప్రసెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఎ.ఎస్ రవికుమార్ చౌదరి.. హీరో బాలకృష్ణ తో వీరభద్ర మూవీని డైరెక్ట్ చేశారు. ఇప్పుడు రాజ్ తరుణ్తో తిరగబడర సామి మూవీలో హీరోయిన్ను బాలకృష్ణ ఫ్యాన్గా చూపించారు. ఎ.ఎస్ రవికుమార్ యజ్ఞం, పిల్లా నువ్వులేని జీవితం, సౌఖ్యం వంటి మూవీస్ ను డైరెక్ట్ తెరకెక్కించారు. ఇక మన్నారచోప్రా రోగ్, జక్కన్న, తిక్కా మూవీస్ తో తెలుగు ఆడియన్స్కు ఫేమస్ అయింది. కానీ మన్నారచోప్రాకి సరైన హిట్ దక్కలే. దీంతో హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో..తిరగబడర సామి మూవీలో మెయిన్ విలన్కి కో స్టార్ గా యాక్ట్ చేసింది.
జెబి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి భాష్యశ్రీ డైలాగ్ రాస్తున్నారు. మకరంద్ దేశ్‌పాండే, రఘు బాబు, జాన్ విజయ్, అంకిత ఠాకూర్, పృధ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Director AS Ravi kumar chowdary kissed Heroine #Mannarachopra in front of media.#TiragabadaraSaami pic.twitter.com/Xq7wCj8VXp
— Milagro Movies (@MilagroMovies) August 28, 2023