బ్లాక్బస్టర్ జవాన్ సీక్వెల్ పై.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ అట్లీ

బ్లాక్బస్టర్ జవాన్ సీక్వెల్ పై.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ అట్లీ

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) డ్యూయల్ రోల్లో కనిపించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ జవాన్(Jawan). తమిళ దర్శకుడు అట్లీ(Atlee) తెరకెక్కించిన ఈ యాక్షన్ ప్యాకుడ్ సినిమాలో..నయనతార, దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించారు. సెప్టెంబర్ 7న విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ..సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. 

అయితే ఈ సినిమా సీక్వెల్ కూడా రాబోతుంది అంటూ వార్తలు వినిపించగా..డైరెక్టర్ అట్లీ  జవాన్ 2 గురించి కీలక వ్యాఖ్యలు చేసాడు. ఈ మూవీకి సీక్వెల్ ఉండే అవకాశం ఉందనే క్లైమాక్స్ లో హింట్ ఇవ్వగా..లాస్ట్ సీన్ లో సంజయ్ దత్ ఆదేశాలతో తండ్రీ కొడుకులు మరో మిషన్ ను పూర్తి చెయ్యడానికి సిద్ధమైనట్లు చూపించారు. దీంతో కచ్చితంగా జవాన్ సీక్వెల్ ఉంటుందని ఫ్యాన్స్ చర్చింకుంటున్నారు.

Also Read :- జవాన్ విజ‌యం షారుక్కి రాసిన ప్రేమ‌లేఖ‌గా భావిస్తా..ఎమోషనలైన డైరెక్టర్ అట్లీ

ఇక ఇదే విషయాన్ని డైరెక్టర్ అట్లీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..స్క్రిప్ట్ రాయడానికి స్ట్రాంగ్ ఐడియా వస్తే మాత్రం 'జవాన్ 2'తో తిరిగి వస్తానని..సెకండ్ పార్ట్ ను విక్రమ్ రాథోర్ క్యారెక్టర్ తో స్క్రిప్ట్ చేస్తానని చెప్పుకొచ్చాడు. జవాన్ రిలీజ్ తర్వాత ఆడియన్స్ ఎక్కువగా విక్రమ్ రాథోర్ పాత్ర గురించి మాట్లాడుకుంటున్నారని.. అందుకే ఆ పాత్రతోనే పార్ట్ 2 రూపొందించేందుకు ప్లాన్ చేస్తామని తెలిపారు. అలాగే తను తీసే ప్రతి మూవీ ఎండింగ్ లో..ఓపెన్ ఎండ్ ఉంటుందని, సీక్వెల్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదని.. కానీ జవాన్ మాత్రం తీసే ఛాన్సెస్ ఉన్నట్లు తెలిపారు. 

జవాన్ మూవీ కేవలం వారం రోజుల్లోనే రూ.700 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక డైరెక్టర్ అట్లీ నుంచి రాబోయే మూవీస్ పైన ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో సోషల్ మీడియా అంతటా అట్లీ పేరు కనిపిస్తోంది.ఈ డైరెక్టర్ తన తర్వాతీ ప్రాజెక్ట్ను నేషనల్ స్టార్ హీరో అల్లు అర్జున్(Allu Arjun) తో చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ సోషియో ఫాంటసీ నేపథ్యంలో..రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని స్టోరీ రెడీ చేసినట్టు సమాచారం.