
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) డ్యూయల్ రోల్లో కనిపించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ జవాన్(Jawan). తమిళ దర్శకుడు అట్లీ(Atlee) తెరకెక్కించిన ఈ యాక్షన్ ప్యాకుడ్ సినిమాలో..నయనతార, దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించారు. సెప్టెంబర్ 7న విడుదలై ఈ సినిమా..మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ ఎగబడ్డారు. కేవలం వారం రోజుల్లోనే ఈ సినిమా రూ.700 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.
లేటెస్ట్గా ఈ సినిమా సక్సెస్ మీట్లో డైరెక్టర్ అట్లీ మాట్లాడుతూ..కోవిడ్ సమయంలో ఈ కథ షారుఖ్కి వినిపించాను. అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవో అందరికీ తెలుసు. అలాంటప్పుడు థియేటర్ల కు ప్రేక్షకులు వస్తారా? అనే డౌట్ వచ్చింది. ఇక అలాంటి టైంలో నన్ను నమ్మి 40 కోట్లు పెట్టి సినిమా చేసే ప్రొడ్యూసర్స్ ఎవరుంటారు? అనుకున్నాను. ఎందుకంటే, ఒక ప్రొడ్యూసర్ ఐడియాలజీ ఎలా ఉంటుందో నాకు తెలుసు. కానీ ఆ సమయంలో షారుక్ నాపై ఎంతో నమ్మకంతో రూ.300 కోట్లు పెట్టారు. ఇక జవాన్ కంప్లీట్ అయ్యే సరికి బడ్జెట్ చాలా ఎక్కువ అయింది. షారుఖ్ మాత్రం ఎక్కడా కూడా కంప్రమైజ్ అవ్వలేదు.కనుకే ఇంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అలాగే, ఈ మూవీ విజయం షారుక్కి నేను రాసిన ప్రేమలేఖగా భావిస్తా' అని అట్లీ అన్నారు.
ఇక డైరెక్టర్ అట్లీ నుంచి రాబోయే మూవీస్ పైన ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో సోషల్ మీడియా అంతటా అట్లీ పేరు కనిపిస్తోంది.ఈ డైరెక్టర్ తన తర్వాతీ ప్రాజెక్ట్ను నేషనల్ స్టార్ హీరో అల్లు అర్జున్(Allu Arjun) తో చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ సోషియో ఫాంటసీ నేపథ్యంలో..రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని స్టోరీ రెడీ చేసినట్టు సమాచారం.