
- మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ శాంతి కుమారి
సిద్దిపేట రూరల్, వెలుగు: మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైన శిక్షణ అందిస్తున్నామని సంస్థ వైస్ చైర్మన్, డైరెక్టర్ జనరల్ శాంతి కుమారి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో శిక్షణ యూనిట్ ను కలెక్టర్ హైమావతితో కలిసి సందర్శించారు.
సంస్థ ద్వారా జిల్లాలోని ఉద్యోగులకు ఇస్తున్న శిక్షణను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల్లో వృత్తి నైపుణ్యం మెరుగుపరిచేందుకు పలు అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఆమె వెంట అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్, డీపీవో దేవకీదేవి, ఎంసీహెచ్ఆర్డీ రీజనల్ ట్రైనింగ్ మేనేజర్ భిక్షపతి ఉన్నారు.
ఋఎన్నికల విధులను సక్రమంగా నిర్వహించాలి
ఎన్నికల విధులను సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ హైమావతి సూచించారు. శుక్రవారం స్థానిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లా కేంద్రంలోని డిగ్రీ కాలేజ్ లో సిద్దిపేట అర్బన్, రూరల్ మండలాల ప్రిసైడింగ్అధికారుల శిక్షణ తరగతులను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రిసైడింగ్అధికారులకు ఎలాంటి డౌట్ వచ్చినా మాస్టర్ ట్రైనర్లను అడగాలన్నారు.
ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల ప్రక్రియ జరిగేలా ప్రతి ఒక్కరూ పని చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీపీవో దేవకీ దేవి, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు. అంతకు ముందు కలెక్టరేట్ లో వెనకబడిన తరగతులు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతిలో కలెక్టర్ పాల్గొన్నారు.