షారుఖ్ తో సినిమా చేయాలని ఉంది: హరీష్ శంకర్

షారుఖ్ తో సినిమా చేయాలని ఉంది: హరీష్ శంకర్

ధర్మపురి టౌన్ నుంచి వచ్చి స్క్రీన్ రైటర్‌ గా జర్నీ మొదలుపెట్టి ‘షాక్’ సినిమాతో అందరినీ షాక్ చేసిన డైరెక్టర్ హరీష్ శంకర్… ఆ తర్వాత రవితేజ ఎనర్జీని ‘మిరపకాయ్’లో చూపించి, గబ్బర్ సింగ్ తో థియేటర్‌ లో కెవ్వు కేక పెట్టిం చారు. రీసెంట్ గా హీరోని విలన్ గా అద్భుతంగా చూపించి గద్దలకొం డ గణేష్ తో ‘సూపర్ హిట్టు .. బొమ్మ హిట్టు ’ అనిపించారు. తనకి ఎంతో ఇష్టమైన షారూఖ్ ఖాన్ తో ఒక కమర్షియల్ ఎంటర్ టైనర్ చేయాలనే కోరిక ఆయనలో ఉందంట. గద్దలకొండ గణేష్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న డైరెక్టర్ హరీష్ శంకర్ ‘వెలుగు’ ముచ్చట్లు .

గద్దలకొండ గణేష్ స్టోరీ ఎలా పిక్ చేసుకున్నారు?

ఇది జిగర్తాండ సినిమాకి రీమేక్. తమిళ్ లో విలన్ క్యారెక్టర్ ను బాబి సింహ చేశారు. అదే పాత్ర తెలుగులో వరుణ్ తేజ్ చేశారు.

వరుణ్ తేజ్ నే ఆప్ట్ అని ఎలా అనిపించింది?

ఒక్కో డైరెక్టర్​కి ఒక్కో విజన్ ఉంటుంది .స్టోరీ అనుకున్నప్పుడు వరుణ్ ని తీసుకుంటే డిఫరెంట్ గా ఉంటుందనిపించింది.

మూవీ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు?

బయట మూవీలోని డైలాగ్స్ చెప్తున్నప్పుడు, సాం గ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది.

ఏ జానర్ మూవీస్ తీయాలనుకుంటున్నారు?

ఎంటర్​టైన్మెంట్ మూవీస్. థియేటర్ లోకి వచ్చిన ప్రేక్షకులు వాళ్ల టెన్షన్ ని మరిచిపోవాలి. అందుకే  హై ఎనర్జిటి క్ ఎంటర్ టైన్మెంట్ సినిమాలు చేస్తుంటా . అదే నా సక్సెస్ మంత్రం.

సైరా మూవీ చూశారా.. ఎలా అనిపించింది?

ఎక్స్ ట్రార్డినరీ మూవీ. మొన్నటి వరకు చరిత్ర సినిమా అయింది. సైరా రిలీజ్ అయ్యాక సినిమానే చరిత్ర కాబోతుంది.

మీకు పర్సనల్ గా ఎలాంటి మూవీస్ ఇష్టం ?

ఎంటర్ టైన్మెంట్.. కమర్షియల్ సినిమాలు అంటే చాలా ఇష్టం . జేమ్స్ బాం డ్ సినిమాల దగ్గర నుం చి యాక్షన్ ఫిల్మ్స్, మ్యూజిక్ ఎంటర్ టైన్మెంట్ అన్నీ ఇష్టం .

ఈ హీరోతో చేయాలి అని ఏమైనా ఉందా, ఉంటే ఎవరు?

షారుఖ్ ఖాన్ తో సినిమా చేయాలని ఉంది.నేను ఆయనకు చాలా పెద్ద ఫ్యాన్. బాలీవుడ్ లో ఆయనతో సినిమా చేయాలని ఉంది.

పవన్ కళ్యాణ్ తో మీ జర్నీ గురించి ?

ఇట్స్ వెరీ మెమొరబుల్, ఇన్స్ పైరింగ్. ఆయన్నికలిసినప్పుడు చాలా పాజిటివ్ గా ఉంటుం ది.చాలా మోటివేట్ చేస్తారు.

ఎల్లువచ్చి లాంటి క్లాసిక్ ని రీమేక్ చేస్తే జనం రిసీవ్ చేసుకుంటారో లేదో అనిపించలేదా?

డైరెక్ట్ చేద్దామని ఇంట్లోం చి బయలుదేరినప్పుడు మన సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటా రని పడ్డ టెన్షన్ తో పోలిస్తే ఒక పాట గురించి ఏముంటుం ది. చెడగొట్టకూడదనుకున్నాం ..అంతే.

ఇప్పుడు ఏ హీరోతో వర్క్ చేస్తున్నారు?

త్రీ ప్రాజెక్స్ట్  ప్లాన్స్ చేస్తున్నా. హీరోలతో స్టోరీ కమిట్ చేశాక రివీల్ చేస్తా.

ఎల్లువొచ్చి గోదారమ్మ సాంగ్ కి థియేటర్ అంతా మారుమోగిపోయింది. మేం వెళ్లిన థియేటర్ లో సినిమా అయిపోయాక ఆ సాంగ్ మళ్లీ ప్లే చేశారు. నేను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు త్రీ ఫోర్ వీక్స్ కి ఇలాంటి వి జరిగేవి. అలాంటి ది ఫస్ట్ వీక్ లో ఇలా జరగడమనేది చాలా సర్ ప్రైజింగ్ అనిపించింది.