Harish Shankar: ఎన్టీఆర్‌ సినిమాపై కాంట్రవర్సీ.. కెమెరామెన్ ఛోటాకు హరీష్ ఓపెన్ లెటర్

Harish Shankar: ఎన్టీఆర్‌ సినిమాపై కాంట్రవర్సీ.. కెమెరామెన్ ఛోటాకు హరీష్ ఓపెన్ లెటర్

డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్(Harish shankar), యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr) కాంబోలో వచ్చిన మాస్ అండ్ కమర్షియల్ మూవీ రామయ్య వస్తావయ్యా(Ramayya Vasthavayya). దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత హరీష్ నుండి వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ, ఈ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. అయితే.. దాదాపు పదేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాపై ఇప్పుడు కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు ఆ సినిమాకు కెమెరామెన్ గా పనిచేసిన ఛోటా కె నాయుడు. 

ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రామయ్య వస్తావయ్యా దర్శకుడు హరీష్ శంకర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో తనకు,దర్శకుడు హరీష్ శంకర్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని, తన అనుభవంతో కొన్ని సజేషన్స్ ఇస్తే, హరీష్ వాటిని పట్టించుకోలేదని, అందుకే.. అతను ఏం చెబితే అదే తీసానంటూ చెప్పుకొచ్చాడు ఛోటా. దాంతో ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది. 

అయితే తాజాగా.. ఛోటా చేసిన కామెంట్స్ పై స్పందిస్తూ నోట్ విడుదల చేశాడు హరీష్ శంకర్. గౌరవనీయులైన ఛోటా కె నాయుడు గారికి(వయసులో పెద్దవారు కాబట్టి). రామయ్య వస్తావయ్యా సినిమా వచ్చి దాదాపు పదేళ్లు దాటింది. కానీ, నేను ఎప్పుడు మీ గురించి తప్పుగా మాట్లాడలేదు. మీరు మాత్రం నా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో మిమ్మల్ని తీసి వేరేవాళ్లతో వెళ్దాం అనే సందర్భం కూడా వచ్చింది. కానీ, రాజు గారు నన్ను కంట్రోల్ చేశారు. గబ్బర్ సింగ్ నా సినిమా అని ఎలా అంటానో.. రామయ్య వస్తావయ్యా కూడా నా సినిమానే.

ప్లాప్ అయినంత మాత్రాన పక్కవాళ్ళ మీద తోసేసి క్యారెక్టర్ కాదు నాది. చాలా రోజుల నుండి ఓపిక పడుతూ వస్తున్నా.. కానీ, మీరు పదే పదే అవే కామెంట్స్ చేస్తున్నారు. ఇకనైనా ఈ విషయాన్నీ ఇక్కడితో వదిలేయండి.. లేదు మళ్ళీ కెలుక్కుంటాను అంటే మాత్రం.. ఎనీ టైమ్.. ఎనీ ప్లాట్ఫామ్.. అయామ్ వెయిటింగ్.. అంటూ స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చారు హరీష్. ప్రస్తుతం హరీష్ షేర్ చేసిన ఈ నోట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ నైట్ పై కెమెరామెన్ ఛోటా కె నాయుడు ఎలా స్పందిస్తారో చూడాలి.