
జేమ్స్ కామెరూన్ (James Cameron) అద్భుత సృష్టి అవతార్(Avatar). పండోర అనే కల్పిత గ్రహాన్ని సృష్టించి అందులోని ప్రకృతి అందాలను కళ్లుచెదిరే విజువల్ ఎఫెక్ట్స్‌తో అందరినీ కట్టిపడేశారు దర్శకుడు కామెరూన్. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 13 ఏళ్ల క్రితం ఈ మూవీ సాధించిన హిట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
లాస్ట్ ఇయర్ 2022 లో ఈ మూవీకి సీక్వెల్గా అవతార్ 2 సినిమా వచ్చి ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. అవతార్ 2–ది వే ఆఫ్ వాటర్ అంటూ వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను మంత్రం ముగ్దుల్ని చేసింది.ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 52 వేల స్క్రీన్ లలో 160 భాషల్లో రిలీజై..రికార్డులు కొల్లగొట్టింది.
లేటెస్ట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ కామెరూన్..అవతార్ ఫ్రాంచైజీలో భాగంగా రాబోతోన్న మూడో భాగాన్ని 2025 డిసెంబర్ 19న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా..త్వరలో అవతార్ 3 టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఈసారి పాత్రలపై ఎక్కువ దృష్టి పెడుతున్నాము. ఈ మూడో భాగంతో మరో కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు అందించేందుకు మేకర్స్ కష్టపడుతున్నట్లు వివరించారు.
అంతేకాకుండా, అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్’లో కనిపించిన కేట్ విన్స్‌లెట్ చేసిన రోనాల్ పాత్రను అవతార్ 3లో కూడా మరింత పొడిగించాము. అందుకోసం ఆమె చాలా కష్టపడి శిక్షణ తీసుకుంటుంది’ అంటూ కామెరూన్ తెలిపారు.
??#Avatar #Avatar3 #film pic.twitter.com/JyQQTJpIJC
— Ikran (@LgIcebreaker) December 14, 2023
అలాగే అవతార్ ఫ్రాంచైజీ (Avatar franchise) లో రానున్న అవతార్ 4 2029లో, చివరిగా రానున్న అవతార్ 5 డిసెంబరు 2031లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇదివరకే ప్రకటించారు. ఇక అవతార్ 3 టీజర్ న్యూస్తో..అవతార్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. టీజర్ రాక కోసం వెయిటింగ్ సర్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
ఫస్ట్ పార్ట్లో పండోరా అందాలను అద్భుతంగా చూపించిన జేమ్స్ కామెరూన్..పార్ట్ 2లో సముద్రపు అడుగు భాగాన్ని అంతకుమించిన అందాలతోనే తెరకెక్కించాడు. ఇక మూడో భాగం కూడా ఎలాంటి అనుభవాన్ని పంచుతుందో అని ఆడియన్స్ ఎదురుచుస్తూన్నారు.