NTR, MGRల స్ఫూర్తితో ప‌వ‌న్ క‌ల్యాణ్ పాత్ర.. వీరమల్లుపై జ్యోతికృష్ణ క్రేజీ అప్‌డేట్స్‌

NTR, MGRల స్ఫూర్తితో ప‌వ‌న్ క‌ల్యాణ్ పాత్ర..  వీరమల్లుపై జ్యోతికృష్ణ క్రేజీ అప్‌డేట్స్‌

పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’.జ్యోతి కృష్ణ దర్శకుడు. ఏఎం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు నిర్మించారు.  ఈనెల 24న విడుదల కానుంది. తాజాగా సెన్సార్ నుంచి యు/ఎ  సర్టిఫికెట్‌‌‌‌ను పొందింది. 2 గంటల 42 నిమిషాల నిడివితో విడుదల కానున్న ఈ సినిమాను సెన్సార్ బోర్డు సభ్యులు ప్రశంసలతో ముంచెత్తారు.

మరోవైపు ఈ చిత్రం గురించి దర్శకుడు జ్యోతి కృష్ణ ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు. ఇందులోని పవన్ కళ్యాణ్ పాత్రను దిగ్గజ నటులు ఎన్టీఆర్, ఎంజీఆర్‌‌‌‌‌‌‌‌ల స్ఫూర్తితో రూపొందించినట్టు చెప్పారు. ధర్మపరుడిగా, బలవంతుడిగా, ప్రజల మనిషిగా పవన్‌‌‌‌కి ఉన్న ఇమేజ్‌‌‌‌ను దృష్టిలో పెట్టుకొని ఆయన పాత్రను డిజైన్ చేశానని అన్నారు.

►ALSO READ | నేటి తరానికి .. ఇలాంటి సినిమాలు చాలా అవసరం: సీఎం రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎంజీఆర్ గారు సందేశాత్మక, నిజాయితీతో కూడిన సినిమాలు చేస్తూ నట జీవితాన్ని కొనసాగించారని, ఆ స్ఫూర్తితోనే ఈ చిత్రంలో ‘మాట వినాలి’అనే ఆలోచింపజేసే పాటను స్వరపరిచామని అన్నారు. అలాగే ఎన్టీఆర్ పోషించిన శ్రీరాముడి పాత్ర నుంచి పవన్ కోసం విల్లు, బాణాన్ని రూపొందించామని తెలియజేశారు.