కోడి రామకృష్ణ కూతురు దివ్య దీప్తి నిర్మాతగా...

కోడి రామకృష్ణ కూతురు దివ్య దీప్తి నిర్మాతగా...

దర్శకుడు కోడి రామకృష్ణ కూతురు దివ్య దీప్తి నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. కిరణ్ అబ్బవరం హీరోగా శ్రీధర్ గాదె దర్శకత్వంలో  ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 16న సినిమా విడుదలవుతున్న సందర్భంగా ఆమె ఇలా ముచ్చటించారు. ‘‘ఇదో చక్కని ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్. తండ్రీకూతుళ్ల మధ్య రిలేషన్‌‌‌‌‌‌‌‌ని ఎలివేట్ చేస్తూ సాగే కథ. అన్ని రకాల కమర్షియల్‌‌‌‌‌‌‌‌ ఎలిమెంట్స్‌‌‌‌‌‌‌‌నీ జోడించాం. కిరణ్, బాబా భాస్కర్ పాత్రల మధ్య ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్మెంట్.. ఎస్వీ కృష్ణారెడ్డి, సంజన పాత్రల మధ్య ఎమోషన్స్ ప్రేక్షకులకు బాగా కనెక్టవుతాయి. చాలా టైటిల్స్ అనుకుని ‘ఎస్‌‌‌‌‌‌‌‌ఆర్ కళ్యాణ మండపం’లో ఫేమస్ డైలాగ్ అయిన ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ని ఫైనల్ చేశాం.

కథకి ఈ టైటిల్ కుదరడంతో పాటు ప్రేక్షకులకు బాగా రీచ్ అయింది. కిరణ్ రాసిన డైలాగ్స్ సినిమాకి ప్లస్. మణిశర్మ ఆరు అద్భుతమైన పాటలిచ్చారు. బ్యాగ్రౌండ్‌‌‌‌‌‌‌‌ స్కోర్ మరో హైలైట్. సినిమా ఔట్‌‌‌‌‌‌‌‌పుట్‌‌‌‌‌‌‌‌తో పాటు బిజినెస్‌‌‌‌‌‌‌‌ విషయంలోనూ ఫుల్‌‌‌‌‌‌‌‌ హ్యాపీగా ఉన్నాం. ఓ మంచి చిత్రంతో వస్తున్నాం. ఫ్యామిలీ ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌కి కచ్చితంగా నచ్చుతుందని నమ్ముతున్నాం. సినిమా నిర్మాణమంటే ప్రతిరోజూ ఒక చాలెంజ్‌‌‌‌‌‌‌‌ని ఎదుర్కోవడమే. అయితే దాన్నో కష్టంలా కాకుండా ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియన్స్‌‌‌‌‌‌‌‌లా తీసుకుని అన్నీ నేర్చుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి డైరెక్షన్‌‌‌‌‌‌‌‌పై కూడా ఆసక్తి ఉంది. నాన్న ఉన్నప్పుడే కొన్ని కథలు రెడీ చేసుకున్నాను. భవిష్యత్తులో డైరెక్షన్ కూడా చేస్తాను.’’