డ్రగ్స్ కేసులో విచారణకు డుమ్మా కొట్టిన క్రిష్

డ్రగ్స్ కేసులో విచారణకు డుమ్మా కొట్టిన క్రిష్

గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో విచారణకు డుమ్మా కొట్టారు డైరెక్టర్.  క్రిష్ ను విచారణకు రావాల్సిందిగా  గచ్చి బౌలి పోలీసులు కోరారు. అయితే తాను ముంబైలో ఉన్నానని..మార్చి 1న    శుక్రవారం విచారణకు హాజరవుతానని పోలీసులకు చెప్పాడు క్రిష్.

డ్రగ్స్ కేసులో క్రిష్ ను  ఏ10గా చేర్చిన సంగతి తెలిసిందే.. డైరెక్టర్ క్రిష్ కు డ్రగ్ పరీక్షలు చేస్తామన్నారు మాదాపూర్ డీసీపీ వినీత్.  డ్రగ్స్ తీసుకున్న అనుమానితుల జాబితాలో డైరెక్టర్ క్రిష్ ఉన్నారని తెలిపారు.  క్రిష్ ను విచారిస్తాం.. ఆయనకు  రక్త,మూత్ర పరీక్షలు చేస్తే అసలు విషయం ఏంటో  తెలుస్తుందన్నారు. క్రిష్ విచారణకు హాజరవుతానని చెప్పారని తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు.