Director Krish: హరిహర వీరమల్లుపై మౌనం వీడిన దర్శకుడు క్రిష్.. రిలీజ్కు ముందు సంచలన పోస్ట్

Director Krish: హరిహర వీరమల్లుపై మౌనం వీడిన దర్శకుడు క్రిష్.. రిలీజ్కు ముందు సంచలన పోస్ట్

పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ జులై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ హిస్టారికల్ ఫిల్మ్ని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కొంత భాగాన్ని తెరకెక్కించాడు. వ్యక్తిగత కారణాలతో క్రిష్ ఈ చిత్రం నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నిర్మాత ఏఎమ్ రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ బ్యాలెన్స్‌‌‌‌‌‌‌‌ షూట్‌‌‌‌‌‌‌‌ను చిత్రీకరించాడు.

సోమవారం (జులై21న) జరిగిన వీరమల్లు రెండు ఈవెంట్లలలో పవన్.. డైరెక్టర్ క్రిష్ గురించి మాట్లాడారు. మంచి హై-కాన్సెప్ట్ కథతో క్రిష్ వచ్చారని, అది తనను ఎంతగానో ఆకట్టుకుందని చెబుతూ ప్రశంసలు కురిపించారు. అయితే, క్రిష్ని అందరూ మరిచిపోతున్న సమయంలో పవన్ అతని పేరును, సినిమా కోసం అతను పడ్డ కష్టాన్ని గుర్తుచేయడంతో సినీ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు.

ఈ తరుణంలోనే లేటెస్ట్గా (జులై22న) దర్శకుడు క్రిష్ Xలో వీరమల్లు సినిమాపై మౌనం వీడి పోస్ట్ పెట్టారు. పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ.. ‘‘ఇప్పుడు ఈ హరిహర వీరమల్లు ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడు. నిశ్శబ్దంగా కాకుండా ఓ గొప్ప ఆశయంతో చరిత్రను ప్రజల ముందుకు తీసుకురానున్నాడు. ఈ ప్రయాణం ఇద్దరు గొప్ప దిగ్గజాల ద్వారా సాధ్యమైంది. వారు సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ ఎందరికో స్ఫూర్తి. వారిలో ఒకరు పవన్‌ కళ్యాణ్. ఆయన  గొప్ప శక్తి ద్వారా ఆశీర్వదించబడిన అసాధారణ శక్తి. ఆయన నిత్యం రగిలే అగ్నికణం. ఎందరికో ఆదర్శం. ‘హరి హర వీరమల్లు’కు ప్రాణం పోసింది ఆయనే. ఆయన ఈ వీరమల్లు మూవీకి వెన్నెముక’’ అని క్రిష్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

ALSO READ : ఫ్యాన్స్ మీరే నా బలం

నిర్మాత A.M. రత్నం గురించి చెబుతూ..‘A.M. రత్నం గారు, భారతీయ సినిమాలో ఉన్న గొప్ప అనుభవజ్ఞులలో ఒకరు. తనకంటూ గొప్ప అనుభవాలను పోగేసుకున్న శిల్పి. సినిమాను దూరదృష్టితో చూడగల జ్ఞానీ. ఎంతటి గందరగోళ పరిస్థితిలో కూడా విశ్వాసంతో ముందుకెళ్లి  సినిమా నిర్మించగల సామర్థ్యం ఉన్న వ్యక్తి అతను. వీరమల్లు కంప్లీట్ అయిందంటే ఆయన అచంచలమైన నమ్మకం వల్లే’ అని క్రిష్ తెలిపారు.

అలాగే వీరమల్లు సినిమా కోసం క్రిష్ తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నాడు. ‘ఈ సినిమా నా అత్యంత ఉత్సాహభరితమైన సినిమాలలో వీరమల్లుకి ప్రత్యేక స్థానం ఉంటుంది. దర్శకుడిగా మాత్రమే కాదు, మరచిపోయిన చరిత్రను అన్వేషించేవాడిగా, అసౌకర్య సత్యాలను అన్వేషించేవాడిగా. ఈ క్రమంలో ప్రపంచ నిర్మాణానికి ఒక అవకాశంగా మారి చాలా విషయాలు తెలుసుకున్నాను. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌కు, ఏఎం రత్నం మనస్పూర్తీగా  కృతజ్ఞతలు.." వీరమల్లు మూవీ సినీ ఇండస్ట్రీలో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రమవుతుంది.. ప్రేమ మరియు కోపంతో: క్రిష్ జాగర్లముడి’ అని తన ట్వీట్ ముగించారు. ఇపుడీ ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

దాదాపు రూ.250కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఏఎమ్ రత్నం సమర్పణలో ఎ దయాకర్ రావు నిర్మించారు.  రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్‌‌‌‌‌‌‌‌  ‘హరిహర వీరమల్లు : స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’పేరుతో  విడుదల కానుంది.