V6 News

Power Peta: రక్తంతో రాసిన రాజకీయాలు.. ఏలూరు బ్యాక్‌డ్రాప్‌లో భారీ పొలిటికల్ థ్రిల్లర్..

Power Peta: రక్తంతో రాసిన రాజకీయాలు.. ఏలూరు బ్యాక్‌డ్రాప్‌లో భారీ పొలిటికల్ థ్రిల్లర్..

టాలీవుడ్లో వర్సటైల్ డైరెక్టర్గా మంచి గుర్తింపు పొందారు లిరిసిస్ట్ కృష్ణ చైతన్య (Krishna Chaitanya). 2010లో బృందావనం సినిమాతో పాటల రచయితగా ప్రస్థానం మొదలుపెట్టిన కృష్ణ చైతన్య, ఇప్పుడు దర్శకుడిగా రాణిస్తున్నాడు. 2014లో ‘రౌడీ ఫెలో’  దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి, చల్ మోహన రంగా, గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమాలతో తన ఐడియాలజీ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు.

ముఖ్యంగా లోకల్ నెటివిటీని, అక్కడి పాలిటిక్స్‌ను కళ్ళకు కట్టినట్లుగా ‘రా & రస్టిక్’ గా చూపిపించడంలో కృష్ణ చైతన్య దిట్ట. ఈ క్రమంలోనే మరో పవర్ ఫుల్ లోకల్ కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. అదే ‘‘పవర్ పేట’’ (Power Peta). ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఏ రేంజ్లో ఉండనుందో ఓసారి లుక్కేద్దాం.

‘‘పవర్ పేట’’: 

డైరెక్టర్ కృష్ణ చైతన్య తెరకెక్కిస్తున్న లేటెస్ట్ భారీ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘‘పవర్ పేట’’. ఏలూరులోని పవర్ పేట నేపథ్యంలో సాగే ఈ వింటేజ్ కథలో హీరోగా వర్సటైల్ యాక్టర్ సందీప్ కిషన్ నటించనున్నాడు. ఈ విషయాన్ని తాజాగా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రకటిస్తూ అధికారికంగా వెల్లడించారు.

గతంలో ఈ ప్రాజెక్ట్లో నితిన్ నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, కొన్ని కారణాల వల్ల నితిన్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా సందీప్ కిషన్తో తెరకెక్కిస్తుండటంతో మరిన్ని అంచనాలు పెరిగాయి. 

‘‘పవర్ పేట’’ టైటిల్ పోస్టర్:

‘‘పవర్ పేట’’ మూవీ ఏలూరు బ్యాక్‌డ్రాప్‌లో పక్కా పొలిటికల్ గేమ్తో వస్తుంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ ఉత్కంఠ రేపుతోంది. చీకటితో నిండిన గది, చిందిన రక్తంతో చెస్ బోర్డు, మధ్యలో ప్రేమకు సింబల్ అయిన గులాబీ.. ఇలా ప్రతిది స్టోరీ థీమ్ని చెబుతుంది.

‘పవర్ పేట’ టైటిల్ కింద ‘ప్రేమ, గౌరవం, పాలిటిక్స్’ అంటూ పెట్టిన ట్యాగ్ లైన్ సినిమా టొన్ని ఆవిష్కరిస్తుంది. మరి ముఖ్యంగా ఈ పవర్ పేటలో ఉండే రాజకీయ ఎత్తుగడలు, అందులో చిక్కిపోయిన ప్రేమ, ఆ మధ్య జరిగే వైలెన్స్‌ను తెరపై కళ్ళకు కట్టినట్లుగా చూపించే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తుంది. 

సందీప్ కిషన్ పోస్ట్:

ఇలాంటి భారీ కాన్సెప్ట్తో కూడుకున్న సినిమాలో హీరోగా సెలెక్ట్ అయినందుకు ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు సందీప్ కిషన్. తన X వేదికగా ట్వీట్ చేస్తూ.. ‘‘16 ఏళ్ల సినిమా ప్రస్థానంలో ఎన్నో సాధించాను. అందుకు నా నిరంతర శ్రమ, పట్టుదలకు మీ ప్రేమ సాక్ష్యంగా నిలిచింది.  నా ప్రతి అడుగుకూ, నేర్చుకున్న ప్రతి పాఠానికీ, మీరు నాపై కురిపించిన ప్రతి చిన్న ప్రేమకూ నేను ఎంతో కృతజ్ఞుడిని.

ఇపుడు పవర్ పేట సినిమాతో నా ప్రతిష్టాత్మక అధ్యాయం మొదలవ్వనుంది. ప్రేమ, గౌరవం, రాజకీయాల కథ ఇది. ఎప్పటిలాగే, మీ అందరి ప్రేమ నాకు కావాలి’’ అని హీరో సందీప్ కిషన్ కోరారు. ఈ సినిమాను 70MM ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి భారీగా నిర్మిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టనుంది చిత్రబృందం.