సెన్సేషనల్ కంటెంట్‌‌తో.. మళ్లీ పెళ్లి 

సెన్సేషనల్ కంటెంట్‌‌తో.. మళ్లీ పెళ్లి 

ఒక్కడు, వర్షం లాంటి సూపర్‌‌‌‌హిట్ చిత్రాలను నిర్మించిన ఎం.ఎస్.రాజు..దర్శకుడిగా మారి డర్టీ హరి, 7డేస్ 6నైట్స్ వంటి బోల్డ్ కంటెంట్ చిత్రాలను రూపొందించారు. తాజాగా నరేష్, పవిత్రా లోకేష్ జంటగా ‘మళ్లీ పెళ్లి’ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. నరేష్​ స్వయంగా నిర్మించిన ఈ మూవీ మే 26న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా ఎం.ఎస్.రాజు మాట్లాడుతూ ‘పక్కవాడి జీవితంలో తొంగిచూడాలనే ఆతృత జనాల్లో వుంటుంది. అలా అని ఈ సినిమా అలాంటిది కాదు. నా కెరీర్‌‌లో చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. నరేష్‌‌ 50 ఏళ్ళ కెరీర్‌‌ను బేస్ చేసుకుని  కథ చెప్పా. నరేష్, పవిత్ర గుర్తింపు ఉన్న నటులు. మిడిల్‌‌ ఏజ్‌‌లో వీరిద్దరూ మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు అనే సరికి కొంతమందికి కనెక్ట్‌‌ అయినా అవ్వవచ్చు. ఇప్పటి జనరేషన్‌‌లో చాలా మార్పు వచ్చింది. అందరూ ఇండిపెండెంట్‌‌గా బతకాలనుకుంటున్నారు. ఆ కోవలోనే ఈ కథ వుంటుంది.

ప్రేక్షకుడికి కొత్త లోకాన్ని చూపించాలని చేసిన సినిమానే ఇది. బెస్ట్‌‌ స్క్రీన్‌‌ప్లే ఇచ్చాను. సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నా. సరదాగా సాగుతూ, సంగీతపరంగా ఆకట్టుకుంటుంది. బోర్‌‌ లేకుండా ఎంటర్‌‌టైన్‌‌మెంట్‌‌ వుంటుంది. లవ్‌‌, డ్రామాతోపాటు కొన్ని సెస్సేషనల్‌‌ అంశాలు ఇందులో వున్నాయి. ఫైనల్‌‌గా మనం ఎలా బతికితే సంతోషంగా ఉంటామనిపిస్తుందో అలా బతకమని చెప్పేదే ఈ సినిమా. అలా అని విచ్చలవిడితనం ఉండదు’ అని చెప్పారు.