లంగ్ క్యాన్సర్ చికిత్సలో నిమ్స్ వైద్యుల ప్రతిభ

లంగ్ క్యాన్సర్ చికిత్సలో నిమ్స్ వైద్యుల ప్రతిభ

పంజాగుట్ట, వెలుగు : లంగ్​ క్యాన్సర్( ఊపిరితిత్తులు) పేషెంట్లకు పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో డాక్టర్లు అందించే ట్రీట్​మెంట్ తో ఎక్కువకాలం జీవిస్తున్నట్టు ఆస్పత్రి డైరెక్టర్ నగరి బీరప్ప పేర్కొన్నారు.  లంగ్ క్యాన్సర్ పై అవేర్ నెస్ డే సందర్భంగా సోమవారం ఎమర్జెన్సీ విభాగం ఆడిటోరియంలో  మెడికల్ అంకాలజీ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో లంగ్ క్యాన్సర్ -కాలేడో స్కోప్ –-2023 పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు.  

ప్రతి వందమంది లంగ్ క్యాన్సర్ బాధితుల్లో 20 మంది వరకు ఎక్కువకాలం జీవించేలా ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తున్నట్టు చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రుల కంటే ఇక్కడ  రికవరీ శాతం ఎక్కువ ఉందని తెలిపారు.  లంగ్​క్యాన్సర్ నివారణ చర్యలపై క్విజ్ నిర్వహించి  ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మెడికల్ అంకాలజీ విభాగధిపతి  డాక్టర్ సదాశివుడు, ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ శాంతి వీర్,  ప్రొఫెసర్ సాయిబాబు, ఉషారాణి, పరంజ్యోతి , డాక్టర్లు పాల్గొన్నారు.