ప్రశాంత్ వర్మ హనుమాన్ ప్రమోషన్స్ షురూ.. ఆసక్తిగా స్పెషల్ పోస్టర్

ప్రశాంత్ వర్మ హనుమాన్ ప్రమోషన్స్ షురూ.. ఆసక్తిగా స్పెషల్ పోస్టర్

టాలీవుడ్ టాలెంటెడ్ అండ్ క్రియేటీవ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prashanth varma) నుండి వస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ హనుమాన్(Hanuman). యంగ్ హీరో తేజ సజ్జా(Teja sajja) హీరోగా వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీపై ఇప్పటికే భారీ అంచనాలనున్నాయి. అందుకే ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. 

లేటెస్ట్గా ఈ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. వినాయక చవితి సందర్బంగా.. ఇవాళ నుంచి(సెప్టెంబర్18) హనుమాన్ ప్రమోషన్స్ షురూ చేయనున్నట్లు తెలిపారు. హీరో తేజ..వినాయకుని భుజంపై ఎత్తుకుని నడిచొచ్చే స్టిల్ ఆకట్టుకుంటుంది. ఇక హనుమాన్ నుండి ఇప్పటికే రిలీజైన ఫస్ట్  గ్లింప్స్ సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్ళింది. గ్లింప్స్లో విజువల్స్ నెక్స్ట్ లెవల్లో ఉందటంతో అన్ని ఇండస్ట్రీల చూపు హనుమాన్ సినిమపై పడింది. 

ALSO READ: అసిస్టెంట్ మ్యారేజ్కి అటెండ్ అయినా స్టార్ హీరో ధ‌నుష్.. వీడియో వైరల్

 హనుమాన్ సినిమా 2024 జనవరి 12న సంక్రాంతి కానుకగా 11 భాషల్లో రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే సంక్రాంతికి రిలీజ్ కోసం పెద్ద సినిమాలు లైన్లో ఉన్నాయి. అందులో గుంటూరు కారం(Guntur kaaram), కల్కి, గేమ్ ఛేంజర్(Game changer) వంటి సినిమాలు డేట్స్ బుక్ చేసుకున్నాయి. అయితే ఈ సినిమాలన్నీ సమ్మర్ కు పోస్ట్ పోన్ కానున్నాయని సమాచాం. దీంతో ఈ లిస్టులోకి హనుమాన్ చేరిపోయింది. చాలా హై రేంజ్ ఎక్స్పెక్ట్షన్స్ తో వస్తున్న హనుమాన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయనుందో తేలియాలంటే.. 2024 జనవరి వరకు ఆగాల్సిందే.