చనిపోయే లోపు ఆ హీరోతో సినిమా చేయాలి.. సలార్ దర్శకుడి షాకింగ్ కామెంట్స్

చనిపోయే లోపు ఆ హీరోతో సినిమా చేయాలి.. సలార్ దర్శకుడి షాకింగ్ కామెంట్స్

కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన డ్రీమ్ గురించి చెప్పుకొచ్చారు. చనిపోయేలోపు ఆ హీరోతో సినిమా చేస్తానని, అదే తన కల అని వివరించారు. ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ సలార్. గ్లోబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకే ఈ సినిమా కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. వారి ఎదురుచూపులకి పులిష్టాప్ పెడుతూ డిసెంబర్ 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. ప్రమోషన్స్ పనుల్లో వేగం పెంచారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా ఆన్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. 

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. తన ఫేవరేట్ నటుడు గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు.. చనిపోయే లోపు అమితాబ్ బచ్చన్​తో ఒక మూవీ చేయాలనేది నా కోరిక. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలు  చూసి చాలా నేర్చుకున్నాను. ఆయనతో సినిమా తీయాలనేది నా అతిపెద్ద కల. నా సినిమాలో ఆయన్ను పెద్ద విలన్​గా చూపిస్తా. నాతో సినిమా చేయడానికి ఆయన ఒప్పుకుంటే.. నా జీవితానికి అదొక పెడ్తా గౌరవంగా భావిస్తాను.. అని చెప్పుకొచ్చారు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తన ఫేవరేట్ యాక్టర్ గురించి చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. మరి ఈ దర్శకుడి కల ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.