
టాలీవుడ్ క్రియేటీవ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prashanth varma), యంగ్ హీరో తేజ సజ్జ(Teja sajja) కాంబోలో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ హనుమాన్(Hanuman). ఈ సినిమా కోసం తెలుగు ఆడియన్స్ తో సహా.. దేశ వ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన టీజర్ అండ్ పోస్టర్స్ కు ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి.
ప్రేక్షకుల అంచనాలను అందుకునేందుకు.. మేకర్స్ చాలా కష్టపడుతున్నారు. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. హనుమాన్ సినిమాను.. 2024 జనవరి 12న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్బంగా హనుమాన్ మూవీ నుండి మరో కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఇప్పటికే సంక్రాంతికి రిలీజ్ కోసం పెద్ద సినిమాలు లైన్ లో ఉన్నాయి. అందులో గుంటూరు కారం(Guntur kaaram), ప్రాజెక్టు కే(Project K), గేమ్ ఛేంజర్(Game changer) వంటి సినిమాలు డేట్స్ బుక్ చేసుకున్నాయి. అయితే ఈ సినిమాలన్నీ సమ్మర్ కు పోస్ట్ పోన్ కానున్నాయని సమాచాం. దీంతో ఈ లిస్టులోకి హనుమాన్ చేరిపోయింది.
ఇక హనుమాన్ సినిమా కూడా చాలా కాలంగా పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. దసరాకో లేదా వినాయక చవితకో సినిమా థియేటర్స్ లోకి వస్తుంది అని ఎదురుచూసిన ఆడియన్స్ కాస్త డిజిపాయింట్ అవుతున్నారు. మల్లి జనవరి వరకు వెయిట్ చేయాలా? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ ఆలస్యానికి కారణం సినిమాపై ప్రస్తుతం ఉన్న అంచనాలే అని తెసులుస్తోంది. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా.. ఆడియన్స్ కు బెస్ట్ క్వాలిటీ ఇవ్వడానికి టీమ్ చాలా కష్టపడుతున్నారు. మరి ఈ రేంజ్ ఎక్స్పెక్ట్షన్స్ తో వస్తున్న హనుమాన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయనుందో తేలియాలంటే.. 2024 జనవరి వరకు ఆగాల్సిందే.