‘సీక్రెట్ సోల్జర్’ కంటెంట్‌పై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నామని, ఈ సినిమా ఆడియెన్స్‌ను కచ్చితంగా సర్‌ప్రైజ్ చేస్తుందని చిత్ర దర్శక నిర్మాత అక్కి విశ్వనాథ్ రెడ్డి అన్నారు. నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా ఆయన రూపొందించిన ఈ చిత్రం సెప్టెంబర్ 18న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అక్కి విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ ‘మొదట ఈ చిత్రానికి ఇందులోని క్యారెక్టర్‌ను ఉద్దేశించి ‘చైనా పీస్’ అనే టైటిల్ పెట్టాం. కానీ చైనా-గల్వాన్ ఉద్రిక్తతలు రావడంతో ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంది.
సెన్సార్ సమస్యలు ఎదురయ్యాయి. దీంతో ‘సీక్రెట్ సోల్జర్’గా టైటిల్ మార్చాం. ఈ సబ్జెక్ట్ మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. అది కూడా సెన్సార్ వల్లే మాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. చాలా డీటెయిల్‌గా సెన్సార్ చేశారు. ఢిల్లీ, ముంబై, కలకత్తా అన్నిచోట్లా రివ్యూ జరిగింది. ఫైనల్‌గా సినిమాకి సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చారు. ఈ కథ నెల్లూరు బ్యాక్‌డ్రాప్‌లో మొదలవుతుంది. ఫ్రెండ్‌షిప్ చుట్టూ సాగుతూనే ఇంటెన్సిటీ, థ్రిల్లింగ్, కామెడీ సహజంగా ఉంటాయి. ఇద్దరు కుర్రాళ్లకు స్పై అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది చాలా ఇంటరెస్టింగ్‌గా ఉంటుంది. నేను నిర్మాత కావడం వల్ల నాలో ఉన్న డైరెక్టర్ కాంప్రమైజ్ కాలేదు. కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసినా.. అన్నీ దాటుకుని ఒక మంచి సినిమాతో వస్తున్నామని బలంగా నమ్మాను. నెక్స్ట్ ఒక రొమాంటిక్ కామెడీ మూవీ చేస్తా. ఆ సినిమాకి కూడా నేనే దర్శకనిర్మాతగా వ్యవహరిస్తాను’ అని చెప్పారు.
