నవ్విస్తూ కథ చెప్పడమే ఇష్టం : దర్శకుడు రామ్ అబ్బరాజు

నవ్విస్తూ  కథ చెప్పడమే ఇష్టం : దర్శకుడు రామ్ అబ్బరాజు

క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైనర్స్‌‌తోనే ఆడియెన్స్‌‌ను అలరిస్తానని  దర్శకుడు రామ్ అబ్బరాజు అన్నాడు.  ‘సామజవరగమన’ లాంటి హిలేరియస్ ఎంటర్‌‌‌‌టైనర్ తర్వాత తను రూపొందించిన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. శర్వానంద్ హీరోగా సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్స్‌‌గా నటించారు. ఏకే ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్ బ్యానర్‌‌‌‌పై అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. 

ఈ సందర్భంగా దర్శకుడు రామ్ అబ్బరాజు మాట్లాడుతూ  ‘మంచి యూత్‌‌ఫుల్ ఫన్ ఉన్న ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్ ఇది. అందరూ కలిసి హాయిగా చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.  ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని ఫీలింగు వస్తుంది. కానీ ఇందులో చాలా కొత్త పాయింట్ ఉంది. శర్వానంద్  ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్  సినిమాలు అదరగొ ట్టేస్తారు. రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా, మహానుభావుడు.. తర్వాత ఆయన చేసిన మరో ఎంటర్‌‌టైనర్ ఇది. చాలా ఫ్రెష్‌‌గా కనిపిస్తారు.  ఇందులో సెకండ్ హాఫ్  క్లైమాక్స్ దగ్గర మంచి ఎమోషన్ వర్కౌట్ అయింది.  సత్య, సుదర్శన్, వెన్నెల కిషోర్  పాత్రలు హిలేరియస్‌‌గా ఉంటాయి.  ఇందులో కామెడీ చాలా ఆర్గానిక్‌‌గా ఉంటుంది. నాకు నవ్విస్తూ కథలు చెప్పడమే ఇష్టం. థియేటర్లో కూర్చుని అందరూ నవ్వుతుంటే మనకు కూడా ఒక ఆనందం కలుగుతుంది.  చిన్నప్పటి నుంచి సంక్రాంతికి ఎన్నో సినిమాలు చూస్తూ పెరిగా. ఇప్పుడు డైరెక్టర్‌‌‌‌గా ఫస్ట్ టైం సంక్రాంతికి నా సినిమా రావడం చాలా సంతోషాన్ని ఇస్తుంది’ అని చెప్పాడు.