Ramesh Varma: నిర్మాణ రంగంలోకి ఖిలాడీ డైరెక్టర్ రమేశ్‌ వర్మ.. కథ అందిస్తూ తొలి సినిమా షురూ

Ramesh Varma: నిర్మాణ రంగంలోకి ఖిలాడీ డైరెక్టర్ రమేశ్‌ వర్మ.. కథ అందిస్తూ తొలి సినిమా షురూ

కొత్త టాలెంట్‌‌‌‌ను ఎంకరేజ్ చేసేందుకు ఆర్వీ ఫిల్మ్ హౌస్‌‌ను ప్రారంభించారు దర్శకుడు రమేష్​ వర్మ. ఈ బ్యానర్ మీద మొదటి ప్రాజెక్ట్‌‌గా ‘కొక్కొరోకో’ అనే సినిమాను ప్రకటించారు. ఈ చిత్రంతో శ్రీనివాస్ వసంతల అనే నూతన దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతోన్నారు. రమేష్ వర్మ కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఆదివారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముహూర్తపు షాట్‌‌కు నిర్మాత రేఖ వర్మ క్లాప్ కొట్టగా, నిర్మాత కూరపాటి శిరీష కెమెరా స్విచ్చాన్ చేశారు. రమేష్ వర్మ స్క్రిప్ట్‌‌ను దర్శకుడికి అందజేశారు.

మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ ఈ చిత్రానికి రైటర్‌‌‌‌ కాగా, సినిమాటోగ్రాఫర్‌‌గా ఆకాష్ ఆర్ జోషి, మ్యూజిక్ డైరెక్టర్‌‌గా సంకీర్తన్, ఎడిటర్‌‌‌‌గా ప్రవీణ్ పూడి వర్క్ చేస్తున్నారు. తెలుగులో ఇదొక చక్కటి ఆంథాలజీ కానుందని, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తామని  దర్శక నిర్మాత రమేష్ వర్మ అన్నారు.

డైరెక్టర్ రమేశ్‌ వర్మ:

ఒక ఊరిలో మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. నానితో రైడ్, రవితేజ 'వీర' వంటి సినిమాలు డైరెక్ట్ చేశాడు. ఆ తర్వాత బెల్లకొండ శ్రీనివాస్తో రాక్షసుడు వంటి సూపర్ హిట్ మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. మరోసారి రవితేజతో జతకట్టి ఖిలాడీ మూవీ చేయగా.. అది బాక్సాపీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది.

ప్రస్తుతం లారెన్స్తో 'కాల భైరవ' అనే మూవీ తెరకెక్కిస్తున్నారు. ఇది లారెన్స్ 25వ సినిమా. ఎ స్టూడియోస్‌‌‌‌ ఎల్‌‌‌‌ఎల్‌‌‌‌పి, నీలాద్రి ప్రొడక్షన్స్, హవీష్‌‌‌‌ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌‌‌‌పై కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.