Razor Glimpse: ఉత్కంఠకు గురిచేస్తున్న రవిబాబు క్రైమ్ థ్రిల్లర్.. 45 సెకన్ల గ్లింప్స్ గూస్ బంప్స్

 Razor Glimpse: ఉత్కంఠకు గురిచేస్తున్న రవిబాబు క్రైమ్ థ్రిల్లర్.. 45 సెకన్ల గ్లింప్స్ గూస్ బంప్స్

యాక్టర్ కం రైటర్, డైరెక్టర్ మల్టీ టాలెంటెడ్ రవిబాబు (Ravi Babu) కొత్త సినిమా అప్డేట్ వచ్చింది. బుధవారం (24 డిసెంబర్ 2025న) రవిబాబు కొత్త సినిమా టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా మూవీకి వినూత్నంగా ''రేజర్'' అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు. రవిబాబు మార్క్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో గ్లింప్స్ ఆసక్తికరంగా ఉంది.

45 సెకన్ల నిడివి ఉన్న ఈ గ్లింప్స్ పూర్తిగా డార్క్, వైలెంట్ థ్రిల్లర్ టోన్‌లో సాగింది. మనుషుల చేతులను నరికేయడం, శరీరాన్ని రెండు ముక్కలుగా కోయడం, కత్తితో తల నరికే సన్నివేశాలు చూపిస్తూ, ఒక్క డైలాగ్ కూడా లేకుండా ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసింది. అయితే, ఈ సినిమాలో హీరోగా రవిబాబే నటిస్తున్నట్టు తెలుస్తుంది.

ఈ చిత్రాన్ని ఫ్లైయింగ్ ఫ్రాగ్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  "న్యాయం అత్యంత కఠినంగా ఉంటుంది. రవి బాబు దర్శకత్వంలో రూపొందిన రేజర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాము. వచ్చే ఏడాది 2026 సమ్మర్ లో రేజర్ థియేటర్లలోకి" అని మేకర్స్ తెలిపారు. నిన్న రిలీజ్ చేసిన పోస్టర్ సైతం ఆకట్టుకుంది. ‘‘ఒక టేబుల్పై ఉంచిన నీళ్ల గ్లాసులో కత్తిరించిన చెవి, దాని పక్కనే కట్టర్, రక్తం మరకలతో చేతి.. ఇలా చుట్టూ మర్డర్ ప్రదేశం”తో పోస్టర్ ఉత్కంఠ పెంచేలా ఉంది. 

ఇదిలా ఉంటే.. రవిబాబు దర్శకుడిగా తనదైన శైలి కథలతో మెప్పిస్తున్నాడు. అందులో భాగంగా వచ్చినవే అల్లరి, అనసూయ, నచ్చావులే, నువ్విలా, మనసారా, అమరావతి, అవును, ఆవిరి, క్రష్, లడ్డూ బాబు, అవును 2 సినిమాలు. ఇప్పుడు మరోసారి డిఫరెంట్ క్రైమ్ కాన్సెప్ట్ తో వస్తుండటంతో అంచనాలు పెరిగాయి. అయితే, ఈ గ్లింప్స్లో క్రైమ్ అంశాలు ఎక్కువ ఉండటంతో వీడియో రెస్టిక్ట్డ్ కంటెంట్లో ఉంది. అందువల్ల 18 ఏళ్లు నిండిన వారే ఈ గ్లింప్స్ చూడాలని మేకర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.