
పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan kalyan)పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు బేబీ(Baby) సినిమా దర్శకుడు సాయి రాజేష్(Sai Rejesh). సెప్టెంబర్ 2 పవన్ పుట్టిన రోజు సందర్భంగా జనసేన పార్టీ(Janasena party)కి రూ.2 లక్షలు విరాళంగా అందించారు. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు సాయి రాజేష్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు.
అంతేకాదు అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసిన స్క్రీన్ షాట్ ను కూడా షేర్ చేశాడు. ఈ ఫొటోకు.. స్పందించే మనసుకి, ఎదిరించే ధైర్యానికి, పోరాడే తత్వానికి నేను ఎప్పటికీ అభిమానినే. అలాంటి మా నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా ఆనవాయితీగా రెండు లక్షల రూపాయలు జనసేన పార్టీకి అందిస్తున్నాను.. అంటూ రాసుకొచ్చాడు సాయి రాజేష్. ఇది చూసిన పవన్ ఫ్యాన్స్ సాయి రాజేష్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.