కెరీర్ నాశనం అవుతుందని తెలిసి కూడా రిస్క్ చేశా

కెరీర్ నాశనం అవుతుందని తెలిసి కూడా రిస్క్ చేశా

హృదయ కాలేయం, కొబ్బరి మట్ట లాంటి కామెడీ చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు సాయి రాజేష్‌‌.. ‘బేబి’ సినిమాతో లవ్‌‌ స్టోరీస్‌‌ కూడా అద్బుతంగా తీయగలనని ప్రూవ్ చేసుకున్నారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ లీడ్‌‌ రోల్స్‌‌లో ఎస్‌‌.కె.ఎన్‌‌ నిర్మించిన ఈ సినిమా సక్సెస్‌‌ఫుల్‌‌గా రన్ అవుతున్న సందర్భంగా సాయి రాజేష్‌‌ ఇలా ముచ్చటించాడు. 

 ‘2015లో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ ఇన్సిడెంట్ ఆధారంగా ‘బేబీ’ కథ రాసుకున్నా. హీరోయిన్‌‌గా తెలుగమ్మాయే కావాలని ఫిక్స్ అయ్యా. కానీ ఇంటర్వెల్ సీన్స్ విని చాలామంది ఆ పాత్ర చేయనన్నారు. ఫైనల్‌‌గా వైష్ణవిని, వాళ్ల పేరెంట్స్‌‌ని ఒప్పించాను. ఇక ఆనంద్ టెన్త్ క్లాస్‌‌ ఫొటోస్ చూసి తనని సెలెక్ట్ చేశా. అతని కంటే ముందు మరో ముగ్గురు హీరోలను కలిస్తే అందులో ఒకరు ‘హృదయ కాలేయం’ డైరెక్టర్‌‌‌‌నని కథ కూడా వినను అన్నారు. ఆ బాధతో ఈ సినిమాను మరింత బాగా తీయాలనుకున్నా. ‘కలర్‌‌‌‌ ఫొటో’కు కథను ఇచ్చింది నేనే అయినా దానిపై జనాల్లో అనుమానాలున్నాయి. 

నిజానికి ఇలాంటి లవ్ స్టోరీస్‌‌ కంటే ‘హృదయ కాలేయం’ లాంటి సినిమాను తీయడం, రాయడమే కష్టం. ‘బేబీ’ సినిమాకు స్క్రిప్ట్ అంటూ లేదు. రేపు సీన్ అంటే ఈరోజు రాసుకునే వాడ్ని. రాత్రి రాసి టీమ్‌‌కు పంపితే ఉదయానికి ప్రాపర్టీస్ వచ్చేవి. లొకేషన్స్ కూడా దగ్గరదగ్గరగా ఉండటంతో తాపీగా సీన్లు తీశాను. దాని వల్ల ఎడిట్ రూమ్‌‌లో ఇబ్బంది పడాల్సి వచ్చింది. నా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవుతారనే నమ్మకంతో పాటు సినిమా ఫ్లాప్ అవుతుందనే భయం కూడా ఉండేది. ఫ్లాప్ అయినా నటీనటులు, కెమెరా, మ్యూజిక్‌‌ ఇలా అందరికీ మంచి పేరు వస్తుంది. నా కెరీర్ నాశనం అవుతుందని తెలుసు. అయినా కూడా రిస్క్ చేశా. నేను మంచి ఉద్దేశంతోనే ఈ సినిమాను తీశాను. కానీ జనాలు ఎక్కడైతే రియాక్ట్ కాకూడదో అక్కడ రియాక్ట్ అవుతున్నారు. నా పరిస్థితి ‘కథ స్క్రీన్‌‌ ప్లే, డైరెక్షన్‌‌ అప్పలరాజు’లో హీరోలా మారిపోయింది’.