Sailesh Kolanu: నాని సంచలన సవాలు గెలిచింది.. 'నా సినిమా సేఫ్' అంటూ డైరెక్టర్ వివరణ!

Sailesh Kolanu: నాని సంచలన సవాలు గెలిచింది.. 'నా సినిమా సేఫ్' అంటూ డైరెక్టర్ వివరణ!

హీరో నాని (Nani) చేసిన సవాలు గెలిచింది. 'నా సినిమా సేఫ్'.. అంటూ ‘హిట్’ సిరీస్ డైరెక్టర్ శైలేష్ కొలను (Sailesh Kolanu) చేసిన ట్వీట్ ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం శైలేష్ హీరో నానితో హిట్ 3 తెరకెక్కిస్తున్నాడు. అయితే, నాని చేసిన ఆ సవాలు, హిట్ 3 పైనే కావడంతో శైలేష్ స్పందించాడు. వివరాల్లోకి వెళితే.. 

హీరో నాని సమర్పణలో వచ్చిన ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’మూవీ ప్రీమియర్స్ (మార్చి 12న) రాత్రి థియేటర్స్లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శైలేష్ కొలను ‘కోర్టు’ప్రీమియర్ చూసిన తర్వాత తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో X వేదికగా పంచుకున్నారు.

ALSO READ | Champion Glimpse: హీరో రోషన్ ఛాంపియన్ గ్లింప్స్.. పాన్ ఇండియా లెవెల్లో శ్రీకాంత్ తనయుడు

"నా సినిమా సేఫ్"..  "కోర్ట్ (Court) మూవీ భావోద్వేగాలను రేకెత్తించే సినిమా. ఇది అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ప్రతి ఒక్కరు ఇది తప్పకుండా చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఇది మనందరికీ చాలా విషయాలను అందిస్తుంది. ఈ సినిమాకు భాగస్వామిగా ఉండటం గర్వంగా ఉంది. నా మిత్రుడు నాని, నిర్మాత ప్రశాంతి, దర్శకుడు జగదీష్, హీరో ప్రియదర్శి అందరికీ శుభాకాంక్షలు. ప్రియదర్శి కెరీర్‌లో మరో అద్భుతమైన పాత్ర ఇది" అని  డైరెక్టర్ శైలేష్ కొలను ప్రశంసించారు. చివరగా "ఇప్పుడు మళ్లీ ఎడిట్ రూమ్‌లోకి వెళ్తున్నా.. అందరూ కోర్టు సినిమా చూడండి" అంటూ తన ట్వీట్‌తో అంచనాలు పెంచేశాడు.

నాని చేసిన సవాలు ఏంటంటే:

ఇటీవలే నాని ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' మూవీ ఈవెంట్ లో ఆసక్తికరమైన వాఖ్యలు చేశాడు.  ' "ఫ్యామిలీతో కలిసి కోర్ట్ సినిమాకి వెళ్లండి. గొప్ప సినిమా చూశారానే ఫీలింగ్‌తో వస్తారు. సినిమాకెళ్ళి మీకు నచ్చకపోతే జూన్ లో రిలీజ్ అవుతున్న తన "హిట్: ది థర్డ్ కేస్" సినిమా చూడవద్దని' ఇంతకంటే బలంగా చెప్పలేనని చెప్పుకొచ్చాడు. దీంతో హీరో నాని చేసిన ఈ వాఖ్యలు ఆసక్తిగా మారాయి.

‘కోర్ట్’ స్టోరీ ఏంటంటే:

చందు (హర్ష్ రోషన్) ఓ డబ్బున్న అమ్మాయి జాబిలి (శ్రీదేవి)తో ప్రేమలో పడుతాడు. దీంతో చెట్టాపట్టాలేసుకుని తిరగుతుంటారు. ఈ విషయం కాస్తా అమ్మాయి మామయ్య మంగ‌ప‌తి (శివాజీ)కి తెలుస్తుంది. దీంతో తన పరపతి పలుకుబడి ఉపయోగించి హర్ష్ రోషన్ పోక్సో చట్టం కింద అరెస్ట్ చేయిస్తాడు. అలాగే అమ్మాయి మైనర్ కావడంతో హర్ష్ రోషన్ పై పోక్సో యాక్ట్ క్రింద కేసు నమోదు చేయిస్తాడు. శివాజీ మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో ఈ కేసుని వాదించడానికి లాయర్లు ఎవరూ ముందుకు రారు. కానే యంగ్ లాయర్ ప్రియదర్శి ఈ కేసుని ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెలియాలంటే థియేటర్లో మూవీ చూడాల్సిందే. 

తాజాగా ఈ సినిమా చూసిన శైలేష్ తన అభిప్రాయాన్ని పంచుకుంటూ హిట్ 3 మూవీని సేఫ్ సైడ్ తీసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్, నాని మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.