V6 News

అఖండ2 ఎఫెక్ట్: మోగ్లీ వాయిదా.. నేనే దురదృష్ట వంతుడిని.. వెండి తెరకు నేనంటే ఎందుకింత ద్వేషం: డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్

అఖండ2 ఎఫెక్ట్: మోగ్లీ వాయిదా.. నేనే దురదృష్ట వంతుడిని.. వెండి తెరకు నేనంటే ఎందుకింత ద్వేషం: డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్

ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఎప్పుడేం జరుగుతుందో ఉహించలేకుండా ఉంది. టాలీవుడ్ సినిమాలకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అఖండ 2 సినిమా డిసెంబర్ 5న చివరి క్షణంలో వాయిదా పడి, మిగతా సినిమాలను ఇబ్బందిలో పెట్టేసింది. గడిచిన వారమే రావాల్సిన అఖండ 2 ఆర్ధిక సమస్యలతో ఆగిపోయి.. ఈ వారం విడుదల అవ్వాల్సిన సినిమాలను ఇరుకున పెట్టేసింది.

గత కొన్ని రోజుల కిందట వాయిదా పడిన ‘అఖండ-2: తాండవం’ సినిమాకు లైన్ క్లియర్ అయినట్లు సమాచారం. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ శుక్రవారం డిసెంబర్ 12న అఖండ 2 థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా డిసెంబర్ 11 రాత్రి 9 గంటలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు పడనున్నాయి. దీంతో డిసెంబర్ 12న రావాల్సిన ‘మోగ్లీ’ మూవీ వాయిదా పడింది.

ఇప్పటికే, సినిమా డిసెంబర్ 12న థియేటర్లలో విడుదలకు అన్ని విధాలుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో అఖండ 2 వస్తుండటంతో ‘మోగ్లీ’ వాయిదా వేశారు. దీంతో నేనే దురదృష్ట వంతుడిని అంటూ డైరెక్టర్‌ సందీప్ రాజ్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కలర్‌ఫోటో మూవీతో నేషనల్ అవార్డు దక్కించుకున్నప్పటికీ.. కనీసం ఇప్పటివరకు తన పేరును సిల్వర్ స్క్రీన్ పై చూసుకోలేదని ఎమోషనల్ అయ్యారు.

డైరెక్టర్‌ సందీప్ రాజ్‌ మాటల్లోనే “ బహుశా కలర్ ఫోటో మరియు మోగ్లీ నాకు బదులుగా మరొక దర్శకుడిని పొందాలి. ఈ సినిమాలు తమ వృత్తి కోసం ఏదైనా చేయగల కొంతమంది ఉత్సాహవంతులైన వ్యక్తులచే నిర్మించబడ్డాయి.

రెండు చిత్రాల మధ్య ఉమ్మడి అంశాలు:

1. ప్రతిదీ బాగానే జరుగుతున్నట్లు అనిపించినప్పుడు, వాటి విడుదలలో ఊహించని ఆటంకాలు ఎదురయ్యాయి.
2. రెండోది నేను.. బహుశా నేనే దురదృష్టవంతుడిని. నేను కూడా అదే బ్యాడ్‌లక్ అనుకుంటూ ప్రారంభించాను.

“దర్శకత్వం: సందీప్ రాజ్” అనే టైటిల్‌ను వెండి తెర తెరపై చూడాలనే నా కల రోజురోజుకూ కష్టతరం అవుతోంది. సిల్వర్‌స్క్రీన్ నన్ను ద్వేషిస్తుందని నేను అనుకుంటున్నాను. రోషన్, సరోజ్, సాక్షి, హర్ష, DOP మారుతి, భైరవ మరియు మరెందరో అంకితభావంతో ఉన్న చాలా మంది వ్యక్తుల అభిరుచి, చెమట మరియు రక్తంతో మోగ్లీని నిర్మించారు. కనీసం వారి కోసమే మోగ్లీకి అన్ని మంచి జరగాలని నేను నిజంగా ఆశిస్తున్నాను” అని సందీప్ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. సందీప్ ఫస్ట్ మూవీ 'కలర్ ఫోటో' కరోనా మహామ్మారి వల్ల డైరెక్ట్ ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే.