‘మేమ్ ఫేమస్’ సుమంత్ ప్రభాస్తో.. ఇండియా మోస్ట్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మూవీ!

‘మేమ్ ఫేమస్’ సుమంత్ ప్రభాస్తో.. ఇండియా మోస్ట్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మూవీ!

‘మేమ్ ఫేమస్’ చిత్రంతో పాపులారిటీ  తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్ వరుస సినిమాల్లో నటిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, హీరో సుమంత్ ప్రభాస్తో ఓ సినిమా చేస్తున్నారు. అదేంటీ? ఇండియాలో మోస్ట్ స్టార్ డైరెక్టర్.. చిన్న హీరోతో సినిమా అనుకుంటున్నారా? ఈ సినిమాకి సందీప్ రెడ్డి డైరెక్షన్ చేయడం లేదు. తనదైన మార్క్తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఆ ప్రాజెక్ట్ వివరాల్లోకి వెళితే.. 

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా హోమ్ బ్యానర్ భద్రకాళి పిక్చర్స్‌లో ఓ సినిమా రూపొందుతుంది. ఇందులో సుమంత్ ప్రభాస్ హీరోగా, '8 వసంతాలు' ఫేమ్ అనంతిక హీరోయిన్గా నటిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ బ్యాక్ డ్రాప్లో పల్లెటూరి ప్రేమ కథగా ఉండనుందని తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని టాక్.

అయితే ఈ సినిమాని డైరెక్టర్ ఆర్జీవీ శిష్యుడు వేణు అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఆర్జీవీపై సందీప్ రెడ్డికి ఎలాంటి అభిమానం ఉందో అందరికీ తెలిసిందే. ఇటీవలే ఈ క్రేజీ డైరెక్టర్స్.. నటుడు జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్ము షోలో కూడా పాల్గొన్నారు. ఈ షోలు పలు విషయాలపై స్పందించి మ్యాడ్ డైరెక్టర్స్ అనిపించుకున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ తోనే వేణు అనే దర్శకుడు పరిచయం అవ్వనున్నాడు. 

‘గోదారి గట్టుపైన’:

సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘గోదారి గట్టుపైన’. నిధి ప్రదీప్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. సుభాష్ చంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై అభినవ్ రావు నిర్మిస్తున్నారు. గురువారం (సెప్టెంబర్ 25న) ఫస్ట్ బ్రీజ్ పేరుతో స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు.

లైట్ హౌస్‌‌‌‌పైకి తన ప్రేమికురాలిని తీసుకెళ్లిన హీరో.. ‘ఇదే సంగమం. ఇక్కడే  గోదావరి సముద్రంలో కలుస్తుంది. ప్రకృతి ఎంత విచిత్రమైనదో కదా.. మంచి నీరు, ఉప్పు నీరు వేరువేరు తత్వాలు అయినప్పటికీ రెండూ ఒకటిగా కలిసిపోతున్నాయి. మనుషులు కూడా ఇలా భేదాభిప్రాయాలు లేకుండా ఒక్కటిగా  కలిసిపోతే ఈ మతభేదాలు అనేవి ఉండవు కదా..’ అనే సుమంత్ ప్రభాస్ చెప్పే డైలాగ్‌‌‌‌ ఆకట్టుకుంది.

ఈ మూవీలో జగపతి బాబు, రాజీవ్ కనకాల, లైలా, దేవి ప్రసాద్, హర్షవర్ధన్, సుదర్శన్ ఇతర  కీలక పాత్రలు పోషిస్తున్నారు.  నాగవంశీ కృష్ణ అందించిన బ్యాక్‌‌‌‌గ్రౌండ్ మ్యూజిక్ ప్లెజెంట్‌‌‌‌గా ఉంది.