ఒక కథ చెప్పడం వేరు.. అవకాశం తెచ్చుకోవడం వేరు: శ్రీకాంత్ అడ్డాల

ఒక కథ చెప్పడం వేరు.. అవకాశం తెచ్చుకోవడం వేరు: శ్రీకాంత్ అడ్డాల

కొత్త బంగారు లోకం(Kotha bangaru lokam) ఫేమ్ శ్రీకాంత్ అడ్డాల(Srikanth addala) దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ పెదకాపు 1(Pedakapu1). రూరల్ అండ్ పొలిటికల్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాతో విరాట్ కర్ణ(Virat karna) హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. రీసెంట్గా ఈ మూవీ నుంచి టీజర్, ట్రైలర్ రిలీజ్ అవ్వగా..గ్రామాల్లో ఉండే వర్గ పోరు, రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని అర్థమవుతోంది.

నిన్న (సెప్టెంబర్ 23న) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని శిల్పకళావేదిక లో ఘనంగా జరిగింది. ఈవెంట్ లో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ.. చాలా దూరం నుంచి వచ్చిన ప్రేక్షకుల అందరికీ థ్యాంక్స్.. మన కంటే మన సినిమా ఎక్కువ మాట్లాడాలని అనుకుంటాను నేను. ఈ సినిమా జర్నీ మొత్తం నిర్మాత రవీందర్ రెడ్డి చెప్పారు. ఆయన చెప్పిన ప్రతి మాట నిజం. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత రవీందర్ రెడ్డికి థ్యాంక్స్. ఒక కథ చెప్పడం వేరు..ఒక అవకాశం తెచ్చుకోవడం వేరు. మనం ఎంత గొప్పగా ఉన్నా ప్రతిసారి అవకాశం రావడం వెనుక ఒక స్ట్రగుల్ ఉంటుందని.. అది కొందరు బయటకు చెప్పొచ్చు కొందరు చెప్పుకోకపోవచ్చని. .నిరంతరం జరిగే ప్రక్రియ ఇదని తెలిపారు శ్రీకాంత్ అడ్డాల.

తను అనుకున్నది జనాల్లోకి తీసుకెళ్లాలన్న ఆర్తి దానికి ఎవరో ఒకరి ఆలంబన కావాలి అలా రవీందర్ రెడ్డి మా తరుపు నిలబడ్డారు. సినిమా హీరో విరాట్ గురించి చెబుతూ.. కొత్త అబ్బాయితో రిస్క్ అని అన్నారు. తన ఫ్రెండ్స్ కూడా వద్దని అన్నారు. కానీ నేను కథను నమ్మా విరాట్ కి కూడా అదే చెప్పా. ఈ సినిమాకు సామాన్యుడి సంతకం అని పెట్టింది కూడా..కొత్త అతను చేస్తేనే టైటిల్ కి అసలైన అర్థం అని అన్నారు శ్రీకాంత్ అడ్డాల. కొత్త అబ్బాయితో పెద్ద స్టార్ కాస్ట్ తో డైరెక్టర్ గా వీరందరితో చేయించుకోవడం అందరి తరపున నిలబడి చేసుకోగలిగాడు అనే పేరు అస్సలు వదులుకోకూడదని ఈ సినిమా చేశానని అన్నారు శ్రీకాంత్ అడ్డాల.   

ఎప్పుడైనా ప్రోత్సాహం ఉంటేనే ఉత్సాహం ఉంటుంది..  లైఫ్ ఆఫ్ ఏ పెదకాపు మీ అందరినీ తప్పకుండా అలరిస్తుందని..ఇంకా మాట్లాడాల్సింది చాలా ఉందని అది సినిమా సక్సెస్ అయ్యాక మాట్లాడతా అన్నారు శ్రీకాంత్ అడ్డాల.

పెదకాపు మూవీని ద్వారకా క్రియేషన్స్‌(Dwarakacreations) బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తొలి భాగం పెదకాపు1 ఈ నెల (సెప్టెంబర్29న) విడుదల కానుంది. ఇందులో విరాట్ కర్ణకి జోడీగా ప్రగతి శ్రీవాస్తవ నటిస్తున్నారు. వీరిద్దరికీ ఇదే ఫస్ట్ మూవీ కావడం విశేషం. మెలోడీ మిక్కీ జే మేయర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.