తెల్లారి పెళ్లి పెట్టుకొని.. పవన్ కళ్యాణ్ సినిమాకు వెళ్ళాడు.

తెల్లారి పెళ్లి పెట్టుకొని..  పవన్ కళ్యాణ్ సినిమాకు వెళ్ళాడు.

అసలే మాది లవ్ మ్యారేజ్, ఎవరికే తెలియకుండా ఇంటినుండి బయటకువచ్చేసాం, తెల్లవారితే పెళ్లి.. తీరా చూస్తే పవన్ కళ్యాణ్ సినిమాకు వెళ్ళాడంటూ తన భర్త గురించి చెప్పుకొచ్చింది డైరెక్టర్ శ్రీరాం ఆదిత్య భార్య ప్రియాంక. తాజాగా ఈ జంట వెన్నెల కిషోర్ హోస్ట్ గా చేస్తున్న అలా మొదలైంది షోకు హాజరై వాల్ల లైఫ్ లో జరుగిన చాలా ఇంటరెస్టింగ్ విషయాల గురించి చెప్పుకొచ్చారు. 

ఇందులో భాగంగా వెన్నెల కిశోర్ మీ పెళ్లి ఎలా జరిగింది అని అడిగాడు.. దానికి సమాధానంగా శ్రీరాం ఆదిత్య.. "మాది ప్రేమ పెళ్లి, ఇద్దరం ఒకే ఆఫీస్ లో వర్క్ చేసేవాళ్ళం. అలా ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. కానీ మా పెళ్ళికి ప్రియాంక వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. అందుకే ఇంట్లో నుండి పారిపోయి పెళ్లి చేసుకున్నాం అని చెప్పుకోచాడు శ్రీరాం. ఇంతలో ప్రియాంక స్పదిస్తూ.. ఇంట్లో నుండి వెళ్ళిపోయాక నెక్స్ట్ డే మార్నింగ్ పెళ్లి అని చెప్పారు. నేను అదే టెన్షన్ లో ఉన్నాను. కానీ శ్రీరాం మాత్రం హ్యాపీగా పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ ఎర్లీ మార్నింగ్ షోకు వెళ్ళాడు. పవన్‌ కల్యాణ్‌ సినిమా కదా మిస్‌ అవ్వకూడదని చెప్పుకోచింది. 

ఇక డైరెక్టర్ శ్రీరాం ఆదిత్య విషయానికి వస్తే.. భలే మంచి రోజు సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆతరువాత శామంతకమణి, దేవ్ దాస్, హీరో వంటి సినిమాలను తెరకక్కిచాడు. ప్రస్తుతం ఈ జంట పాల్గొన్న ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.